Sriya Reddy In Salaar Movie: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘సలార్’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదల అయ్యింది. డిసెంబర్ 22న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తొలి షో నుంచి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హీరోయిన్ శృతి హాసన్ సైతం ఆధ్య పాత్రలో ఆకట్టుకుంది. వీరితో పాటు మరో నటి గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు శ్రియా రెడ్డి. ఈ చిత్రంలో ఆమె రాధా రమా మన్నార్ పాత్రలో కనిపించింది. అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది. ‘బాహుబలి‘ సినిమాలో శివగామి పాత్ర మాదిరిగానే ‘సలార్‘ చిత్రంలో రాధారమా మన్నార్ పాత్ర ఉంది. రాధారమా పాత్రకు శ్రియారెడ్డి నూటికి నూరు శాతం న్యాయం చేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకీ శ్రియా రెడ్డి ఎవరు?
41 ఏళ్ల శ్రియా రెడ్డి తమిళంతో పాటు తెలుగులోనూ నటిగా రాణిస్తోంది. ఆమె తండ్రి భరత్ రెడ్డి. వృత్తిరీత్యా క్రికెటర్. శ్రియా తమిళ చిత్రం ‘సమురాయ్‘తో వెండితెరకు పరిచయం అయ్యింది. 2003లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా అందిరినీ ఆకట్టుకుంది. ‘అప్పుడప్పుడు‘ అనే మూవీతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘అమ్మ చెప్పింది‘ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కనిపించింది. ఇక విశాల్ ‘పొగరు‘ సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నటుడు హీరో విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది. సినిమా పరిశ్రమకు చాలా కాలం దూరం అయ్యింది. దాదాపు దశాబ్దం తర్వాత శ్రియా మళ్లీ ‘సలార్‘లో కనిపించింది. ఇందులో వరదరాజు మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరి రాధా రమా పాత్రను శ్రియా పోషించింది.
2018లో విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకున్న శ్రియా రెడ్డి
శ్రియారెడ్డి 2008లో సినీ నిర్మాత,నటుడు, విశాల్ సోదరుడు అయిన విక్రమ్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. 2018లో తమిళంలో ‘సిల సమయంగళిల్‘ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. ‘సలార్‘తో మరోసారి వెండితెరపై సత్తా చాటింది.
‘సలార్‘ గురించి..
‘KGF‘ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Also Read: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?