Testosterone Screening After 30:యాక్టివ్‌నెస్, పిట్‌నెస్, బలంగ గురించి చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా టెస్టోస్టెరాన్ ప్రస్తావన వస్తుంది. దీని స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత బలంగా ఉంటారని ప్రచారం ఉంది. దీన్ని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అయినా దీనిపై ఉన్న అపోహలు పోవడం లేదు. ఒక వ్యక్తి శక్తి కేవలం టెస్టోస్టెరాన్‌పై కాకుండా వారి డైలీ రొటీన్, తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వాదన ప్రచారంలో ఉన్న టైంలో అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు దాటిన సైనికులంతా కచ్చితంగా టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

Continues below advertisement

అయితే టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షలు వేనుక సైనికుల ఆరోగ్యం సంరక్షణ దాగి ఉందని అమెరికా ఆర్మీ చెబుతోంది. అమెరికా ఏ చెప్పినా సరే ఇప్పుడు ఆ దేశం తీసుకున్న నిర్ణయంతో టెస్టోస్టెరాన్‌పై చర్చ మొదలైంది. 

30 ఏళ్లు దాటిన వారికి టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షలు 

సైనికులకు ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అక్కడ సాధారణంగా జరుగుతుంది. అయితే ఈసారి ఆ పరీక్షల్లో టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షను చేర్చారు. ఇది 30 ఏళ్లు దాటిన ప్రతి సైనికుడు చేసుకోవాలని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు. 30 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా తమ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఈ పరీక్షల్లో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయి తక్కువ ఉన్నట్టు తేలిన వారికి ప్రత్యేకంగా టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థరెపీ ఇస్తారు. 

Continues below advertisement

ఈ పరీక్షలు, థెరపీ అనేది సైనికుల పని తీరును మెరుగుపరచడానికి కాదని హెగ్సెత్‌ చెప్పారు. సైనికుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. శారీరకంగా, మానసికంగా వారంతా ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. హార్మోల్ లోపాలు ముందుగానే పసిగడితే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండటమే కాకుండా వారి ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా కూడా ఆదుకునే వాళ్లం అవుతామని వివరించారు. 

అమెరికా ఆర్మీ తీసుకొచ్చిన కార్యక్రమం సైనికుల్లో హార్మోన్‌ల తగ్గుదలను గుర్తించేందుకు తీసుకొచ్చామని చెబుతున్నారు. అయితే దీన్ని వైద్యరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. దీని కోసం వయసు ఆధారంగా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ హార్మోన్‌ల ఉత్పత్తి స్థాయి తగ్గుతుందని వివరిస్తున్నవారు. అందులో భాగంగా టెస్టోస్టెరాన్ స్థాయిలో తగ్గుదలన కనిపిస్తుందని పేర్కొంటున్నారు. దీనికి కేవలం రక్త పరీక్ష ద్వారా హార్మోన్‌ల తగ్గుదలను నిర్దారించలేమని మరిన్ని పరీక్షలు, పరిశీలన అవసరమని అంటున్నారు. 

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఎవరు ఎప్పుడు తీసుకోవాలి?

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది ఎవరు ఎప్పుడుపడితే అప్పుడు తీసుకునేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్‌ల లోపం ఉందని నిర్ధిష్ట పరీక్షలతో నిర్దారణ అయిన తర్వాత మాత్రమే, వైద్యుల పర్యవేక్షణలో ఈ TRT తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే పనితీరు మెరుగుపరుచుకోవడానికి గానీ, వృద్ధాప్యాన్ని జయించాలనే ఆలోచనతో ఇలాంటి థెరపీలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారి పని తీరును మెరగుపరిచేందుకు చేసే చికిత్స కాదని స్పష్టం చేస్తున్నారు. 

TRT ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఎందుకు ప్రమాదం?

ఈ టీఆర్టీ వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి. లేకుంటే వైపరిత్యాలు చాలా దారుణంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్లు దెబ్బతింటాయని చెబుతున్నారు. మొటిమలు, వంధ్యత్వం, ఎర్రరక్తకణాలు పెరగడం వంటి ప్రమాదకరమైన సమస్యలు వెంటాడుతాయి. 

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.