ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గినా.. కొత్తకొత్త వైరస్‌లు, వ్యాధులు ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. అత్యంత అరుదైన మంకీపాక్స్ ( Monkeypox ) వ్యాధి ఇంగ్లాండ్ లో నమోదైంది.  అత్యంత అరుదైన మశూచి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కోవకు చెందినది ఈ మంకీపాక్స్. ఇటీవల నైజీరియా నుంచి ఇంగ్లాండ్ వచ్చిన ఓ వ్యక్తి ఈ అరుదైన వైరస్ సోకింది. ప్రస్తుతం లండన్ లో ( london )  చికిత్స పొందుతున్నాడు బాధితుడు. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధిని మొదట కనుక్కున్నారు. అడవి జంతువులు, ముఖ్యంగా ఎలుకల ( Mouse ) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని నిపుణులు తెలిపారు.


తాజ్‌మహల్‌పై సడెన్‌గా ఈ లవ్ ఏంటి మస్క్ మామా! కొంప తీసి కొనేస్తావా?
 
1970లో డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో తొలి మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాధి నమోదైంది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపిస్తుంటాయి.  బ్రిటన్‌, అమెరికా, ఇజ్రాయిల్‌, సింగపూర్‌ దేశాల్లోనూ ఈ వ్యాధి నమోదైంది. 2018లో చివరి సారిగా బ్రిటన్‌లో ( Briton ) మంకీపాక్స్‌ వ్యాధి బయటపడింది. ఇప్పుడు మరోసారి బ్రిటన్‌లోనే ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి కొన్నివారాల్లోనే కోలుకోవడం సానుకూల అంశమని వైద్యులు తెలిపారు. ఇతరులకు కూడా సులభంగా వ్యాపించదని  నిపుణులు అంచనా వేస్తున్నారు.   వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఇతరులకు చర్మంపై గాయాలు, శ్వాస, ముక్కు, గొంతు, కళ్ల నుంచి సోకవచ్చని అన్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మంపై దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.


శ్రీలంకలో కొనసాగుతున్న హింసాకాండ! ప్రధాన మంత్రి ఇంటికి నిప్పు, అధ్యక్షుడి ఇంటి ముందూ నిరసనలు


ప్రపంచం కరోనా ( Corona ) వల్ల గత రెండేళ్ల నుంచి ప్రపంచం కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతోంది. వరసగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి.  కొత్త కొత్త వైరస్ జాడలు, వ్యాధులు ప్రపంచంలో ఎక్కడో చోట బయటపడుతూనే  ఉన్నాయి. ఇప్పుడీ మంకీపాక్స్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇది కరోనాలా వ్యాపిస్తుందా లేదా అన్నదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO  ) చేయాల్సి ఉంది. 


నిరసనకారుల 'లంకా దహనం'- రహస్య ప్రాంతానికి పారిపోయిన మాజీ ప్రధాని!