Manipal Liver Transplantation: కాలేయ చికిత్సలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం కాదని.. ఆపరేషన్ కు పూర్వం తీసుకోవలసిన జాగ్రత్తలే ముఖ్యం అని విజయవాడ మణిపాల్ ఆసుపత్రి ప్రతినిధులు అన్నారు. మణిపాల్ యాజమాన్యం కాలేయ చికిత్సలో పయనీర్ సంస్థ సౌత్ ఆసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ తో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం సమగ్రమైన కాలేయ చికిత్స, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రోటోకాల్స్‌లో కొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తుందని మణిపాల్ యాజమాన్యం తెలిపింది.
ఆపరేషన్ ముందు జాగ్రత్తలే ముఖ్యం
కాలేయ చికిత్సలో ఆపరేషన్ కు మందు తీసుకోవలసిన జాగ్రత్తలు, లివర్ డోనార్ ను ఎంపిక చేసుకోవడంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్ అలాగే ఆపరేషన్ తర్వాత అమలు పరిచే.. Enhanced Recovery After Surgery (ERAS) ట్రాన్స్‌ప్లాంటేషన్ రికవరీలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాలేయ మార్పిడి అన్నది ఈ వ్యాధిలో చివరి ప్రయత్నం. ఈ వ్యాధి లక్షణాలు ముదరక ముందే గుర్తించి తగిన చికిత్స అందించాలన్నదే మా లక్ష్యం అని మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ చంద్ర అన్నారు.
కాలేయ వ్యాధి వచ్చిన పేషంట్లను తరచుగా ఫాలోఅప్ చేయడంతో పాటు.. మంచి పొటన్షియల్ డోనార్స్‌ను గుర్తించడం అత్యంత ముఖ్యమన్నారు. “ బ్లడ్ గ్రూపులు సరిపోవడం అత్యంత ప్రధానమైదే. కానీ.. కాలేయ మార్పిడి కంటే మందే దాతలు-గ్రహీతలకు మధ్య ట్రాన్స్‌ప్లాంటేషన్ వర్కప్ ఎంత వరకూ ఉంటుందో చూడటం కూడా ముఖ్యం. ఇక డోనేషన్ ఇచ్చే వాళ్ల భద్రత అత్యంత ముఖ్యం. కాలేయ దానం తర్వాత కూడా వారు ఆరోగ్యంగా జీవనం సాగించడం ముఖ్యం"
రిజెక్షన్ కేసులూ ఉంటాయ్
"ఏ అవయువదానంలో అయినా సరే…రిజెక్షన్ సాధారణంగా ఉండేదే. లివర్ ట్రాన్సప్లాంటేషన్‌లో కూడా ఉంటుంది. అందుకే ఆపరేషన్ తర్వాత మానటరరింగ్, ఇతర జాగ్రత్తలు తీసుకుంటాం. లివర్ స్వయంగా పెరుగుతుంది. కాలేయ దానం చేసినవాళ్లు కొన్నినెలల్లో సాధారణ జీవనం గడపగలుగుతారని" రాజేష్ తెలిపారు
సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ తో భాగస్వామ్యం తర్వాత విజయవాడ మణిపాల్ కాలేయ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారిందని మణిపాల్ క్లస్టర్ డైరక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలేయమార్పిడిలను మణిపాల్ హాస్పిటల్ నిర్వహించిందని.. లివర్ క్యాన్సర్ నిర్థారణ అయిన నాలుగేళ్ల బాలుడికి కాలేయమార్పిడి శస్త్ర చికిత్స చేయడం తమ ఆసుపత్రి మైలురాయిల్లో ఒకటని చెప్పారు.