Singer Pravasthi Aradhya Reacts On Sunitha Comments: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది సింగర్ ప్రవస్తి (Pravasthi Aradhya) అంశమే. తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని.. బాడీ షేమింగ్ చేశారంటూ 'పాడుతా తీయగా' నిర్వాహకులపై ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ సింగర్, ఆ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సునీత (Sunitha) సైతం స్పందించారు. సునీత కామెంట్స్‌పై తాజాగా ప్రవస్తి సైతం మరోసారి స్పందించారు.
రీల్‌లో కాదు.. రియల్‌గా మాట్లాడండి
జడ్జ్ సునీత అన్నట్లుగా తనను ఒళ్లో కూర్చోబెట్టుకుని బుజ్జగించాలని అడగలేదని.. కానీ మినిమం రెస్పెక్ట్ మాత్రమే తాను కోరుకున్నానని ప్రవస్తి తాజా వీడియోలో తెలిపారు. 'రీల్‌లో సునీత ఎంత బాగా మాట్లాడారో.. రియల్‌లో కూడా అలానే మాట్లాడితే ఇదంతా జరిగేది కాదు. సాంగ్స్ సెలక్షన్స్ విషయంలో ముందే మాకు రైట్స్ ఇచ్చారు. నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి రైట్స్ అయితే ప్రాబ్లమ్ కాదు.
సాంగ్ వినకుండానే ఓ సాంగ్‌కు ముందే కామెంట్స్ ఇచ్చేశారు. నేను చెప్పని పేర్లను సైతం మీరు వీడియోలో చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకు మీ నుంచి ఎందుకు సమాధానం రాలేదు. లిరిక్స్ మర్చిపోయిన వారి గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు.' అని ప్రవస్తి ప్రశ్నించారు.
Also Read: ఏడాది తర్వాత ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులో వచ్చేసిన హన్సిక 'గార్డియన్', స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వాళ్లను ఎందుకు అప్రిషియేట్ చేశారు?
ఎక్కువ లిరిక్స్ ఉన్న పాటలను హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి పాడితే సునీత గారు కనీసం గుర్తింపు ఇవ్వలేదని ప్రవస్తి అన్నారు. 'చేతి మీద లిరిక్స్ రాసుకుని వచ్చి, లిరిక్స్ మర్చిపోయిన వాళ్లను అప్రిషియేట్ చేశారు. లిరిక్స్ గుర్తు పెట్టుకుని కష్టపడి పాడిన మమ్మల్ని మర్చిపోయారు. ఇది చాలా హర్టింగ్‌గా ఉంటుంది. నేను అప్ సెట్ అయ్యానని నా దగ్గరకు వచ్చి సునీత గారు మాట్లాడలేదు. ప్రొడక్షన్ వాళ్లతో మాట్లాడిన తర్వాతే సునీత గారు నా దగ్గరకు వచ్చి మట్లాడారు.' అని ప్రవస్తి తెలిపారు.
హర్ట్ చేశారు మేడమ్..
తాను రోడ్డు మీదకు వచ్చి ఈ విషయాలు మాట్లాడానని సునీత మేడమ్ అన్నారని.. ఓ 19 ఏళ్ల అమ్మాయికి ఇది చాలా హర్టింగ్ వర్డ్ అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేశారు. 'నేనేమీ ధర్నాలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సునీత మేడమ్ ఆ మాట అనడం చాలా తప్పు. కీరవాణి గారు వెడ్డింగ్‌లో పాడే వారు తన దృష్టిలో సింగర్స్ కాదు అనే మాట అన్నారు.
అది నాకు చాాలా ఇన్సల్టింగ్‌లా అనిపించింది. ఒపీనియన్‌కు ఇన్సల్టింగ్‌కు చాలా తేడా ఉంది. ఆ విషయాన్నే నేను చెప్పాను. నేను ఇంతకు ముందు కూడా చాలా రియాలిటీ షోల్లోనూ ఎలిమినేట్ అయ్యాను. కానీ ఎప్పుడూ కూడా నేను ఇలా వీడియోలు పెట్టలేదు. నాకు అన్యాయం జరిగింది కనుకే ఇలా వీడియోలో నా ఆవేదన చెప్పాను.' అని ప్రవస్తి వివరించారు.
జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్‌కు..
ఇదే సమయంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సైతం కౌంటర్ ఇస్తూ ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేశారు. 'మేం రైట్స్ అన్నీ చూసుకుని సాంగ్స్ పంపిస్తే వాటిని కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు అందులో మా సెలక్షన్ ఎక్కడ ఉంది. నేను చాలాసార్లు మెలోడీ కోసం అడిగినా ఇవ్వలేదు. నాంపల్లి సాంగ్‌కు తగిన కాస్ట్యూమ్ ఇవ్వలేదు. అది అడిగితేనే నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఆ డ్రెస్ వేసుకుని మీ దగ్గరకు వచ్చినా ఇది కెమెరాలో బాగుంటుంది అని చెప్పారు. నేను పొట్టి పొట్టి బట్టలు అని ఎక్కడా అనలేదు. ఇక్కడ పేవరెటిజమ్ ప్రకారమే నడిచింది. మాకు టైం లేకే అగ్రిమెంట్‌లో సైన్ చేయాల్సి వచ్చింది.' అని ప్రవస్తి వీడియోలో వివరించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.