ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. గత ఏడేళ్లుగా దేశంలోని వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తున్న క్రమంలో మరో ముందడగు వేశామని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇది ఓ కీలక దశగా మోదీ అభివర్ణించారు.
డిజిటల్ హెల్త్ ఐడీలు..
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ప్రతి భారతీయుడికీ హెల్త్ ఐడీ కేటాయిస్తామని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పీఎండీహెచ్ఎం అమలవుతోంది. టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోంది.
ఎలా పనిచేస్తుంది?
- ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్ కార్డ్‌లతో పాటు హెల్త్ ఐడీలను అందించనున్నారు.
- వీటి ఆధారంగా ప్రజలు తమ ఆరోగ్య సమాచారాన్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయలి.
- ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, ట్రీట్మెంట్ రికార్డ్‌లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్‌సైట్‌లో భద్రంగా ఉంటుంది.
- హెల్త్ ఐడీ చెబితే మన ఆరోగ్య వివరాలు మొత్తం తెలుస్తాయి.
వ్యాక్సినేషన్‌పై ప్రశంసలు..
దేశంలో ప్రస్తుతం సాగుతోన్న భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మోదీ ప్రశంసించారు. కొవిన్ ద్వారా వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం కూడా అందిస్తున్నామని గుర్తుచేశారు.
Also Read:Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్