దుంప జాతికి చెందిన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. భూమిలోనే పెరిగే తెల్లని దుంప ఇది. దీని వాసన పచ్చిగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ దీన్ని వండాక మంచి రుచి వస్తుంది. అంతేకాదు ముల్లంగిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. పోలిక్ యాసిడ్, పొటాషియం, జింక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటివి అధికంగా ఉన్నాయి. అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ముల్లంగిని అతిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


డయాబెటిస్ ఉన్న వారికి 
మధుమేహంతో బాధపడేవారు ముల్లంగిని తినడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ముల్లంగిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే లక్షణం ఉంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి ఎంత తిన్నా లాభమే కానీ ఆరోగ్యపరమైన నష్టాలు ఉండవు. ముల్లంగి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని తప్పకుండా తీసుకోవాలి. దీనికి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించే గుణం ఉంది. కాలేయ ఆరోగ్యానికి, కామెర్ల వ్యాధి రాకుండా చేయడానికి ముల్లంగి దోహదపడుతుంది. అందం కోసం కూడా ముల్లంగిని తినవచ్చు. చర్మాన్ని సంరక్షించడంలో ఇది ముందుంటుంది.


రోగనిరోధక శక్తికి ముల్లంగిని వారానికి రెండు సార్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. ప్రాణాంతక అనారోగ్యాలైన క్యాన్సర్ వంటివి దూరంగానే ఉంటాయి. ముల్లంగి త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఆస్టియోపొరోసిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ముల్లంగి రుచిని పట్టించుకోకుండా సాంబారులో లేదా కూరలో భాగం చేసుకోవాలి. నీళ్లు కలపని వేపుడులా చేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ముఖ్యంగా టమాటా ముల్లంగి కలిపి కూర అదిరిపోతుంది.


ముల్లంగి కూరను వారానికి రెండు సార్లు తినడం అలవాటుగా మార్చుకోవాలి. దీని వల్ల చక్కనిఆరోగ్యం సొంతమవుతుంది. ముల్లంగిలో ఉండే పోషకాలు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ముల్లంగి వంటివి క్రూసిఫెరస్ కూరగాయలు. అంటే నీటితో కలిసినప్పుడు అవి ఐసోథియోసైనేట్లుగా విడిపోతాయి. ఇవి క్యాన్సర్ వంటి కణితులు ఏర్పడకుండా సమర్థంగా అడ్డుకుంటాయి. జలుబు, దగ్గు, నోటి సమస్యలు రాకుండా అడ్డుకునే గుణం వీటిలో ఉంది. 


Also read: అధిక రక్తపోటును అదుపులో ఉంచాలా? పాలలో ఇది కలుపుకొని తాగండి












































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.