No Nut November in Telugu : నవంబర్​ నెల వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో రెండు టాపిక్స్ హైలైట్ అవుతాయి. వాటిలో ఒకటి నో షేవ్ నవంబర్, మరొకటి నో నట్ నవంబర్. ఈ రెండూ కూడా మగవారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించేందుకు పాటిస్తున్నారు. నో షేవ్ నవంబర్ క్యాన్సర్​ గురించి అయితే.. నో నట్ నవంబర్ హస్త ప్రయోగంపై అవగాహన పెంపొందిస్తుంది. 


పురుషులైనా.. స్త్రీలు అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం మన సమాజంలో స్త్రీలు కాస్త సున్నితంగా ట్రీట్ చేస్తారు. కానీ మగవారిని చాలా స్ట్రాంగ్​గా భావిస్తారు. కానీ హెల్త్​ విషయానికి వస్తే లింగభేదం చూడకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. మగవారు కాస్త బలంగా ఉంటారు కాబట్టి.. వారిని ఆరోగ్యంపై ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిన్నచూపు ఉంటుంది. కానీ వారి విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నవంబర్ సూచిస్తుంది. 


వాటికి చెక్..


నో నట్ నవంబర్​లో భాగంగా ఈనెల మొత్తం హస్తప్రయోగానికి దూరంగా ఉండడమే దీని థీమ్. ఎందుకు ఈ చర్యకు దూరంగా ఉండాలి. చేస్తే ఏమవుతుంది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హస్తప్రయోగం అనేది తప్పేమి కాదు. ప్రతి వ్యక్తి ఇతరులతో సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా చేసుకునే ప్రక్రియ ఇది. పైగా ఇది చేయడం వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పోర్నోగ్రఫిని తగ్గించడమే దీని లక్ష్యంగా చెప్పవచ్చు. 


స్పెర్మ్ నాణ్యతపై ఎఫెక్ట్


ఈ మధ్యకాలంలో పిల్లలు నుంచి పెద్దవారికి ఫోన్ వినియోగం పెరిగిపోతుంది. అందరి గురించి కాదు కానీ కొందరిలో పోర్న్​ గురించి ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ సమయంలో హస్తప్రయోగం చేయడం అలవాటుగా మారిపోయింది. కొందరు అదే పనిగా చేస్తూ.. దానికి బానిస అయిపోతున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా చేస్తే అది స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు సెక్స్​ పరమైన పలు సమస్యలను తీసుకొస్తుంది. కాబట్టి దీనిపై అవగాహన కల్పిస్తూ.. నో నట్స్ నవంబర్​ను ఫాలో అవుతున్నారు. 


సరిగ్గా ఆడలేరు..


ఇలాంటి లైంగిక చర్యలపై సరైన అవగాహన లేక చాలా మంది తమ హెల్త్​ మీదకి తీసుకెళ్తున్నారు. ఈ అంశాన్నే టచ్​ చేస్తూ.. OMG2 సినిమా తీశారు. చిన్ననాటి నుంచే సెక్స్ ఎడ్యూకేషన్​పై అవగాహన కల్పించాలనేదే దీని సారాంశం. అవును.. దీని గురించి తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడానికి ఇబ్బంది పడతారు. టీచర్స్​ కూడా వారికి సరైన అవగాహన ఇవ్వరు. వాళ్లు ఫోన్స్​లో చూసేదే నిజమని భావించి.. సరైన అవగాహన లేక దానికి బానిసలైపోతారు. ఇది వారిలో లైంగిక కోరికలు పెంచి పీక్ స్టేజ్​కి తీసుకెళ్లిపోతుంది. అది కొందరిలో అత్యాచారాలకు ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా సెక్స్ చర్యలో ఎక్కువసేపు పాల్గొనలేరు. శారీరకంగా కూడా చాలా వీక్​ అయిపోతారు. అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రందించండి. వారు మీకు తగిన సూచనలు చేస్తారు. 


అన్ని అంశాలను దృష్టిలోకి తీసుకునే నో నట్స్ నవంబర్ పాటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ దీని గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. లేదంటే చక్కగా ఆడలేక.. రన్​ అవుట్ అవ్వాల్సి వస్తుంది. 


Also Read : అబ్బాయిలు మీరు క్లీన్​ షేవ్​తోనే కాదు, గడ్డంతోనూ అందంగా కనిపించొచ్చు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.