Bread : ఉదయాన్నే ఈజీగా సిద్ధం చేసుకొనే బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్. ఇడ్లీ, దోశ, పూరీలు చేయాలంటే ఎంత టైమ్ పడుతుందో తెలిసిందే. అందుకే, ఈ బిజీ లైఫ్‌లో అలాంటి టిఫిన్లు చేయడనికి టైమ్ సరిపోదు. అందుకే, చాలామంది బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, బ్రెడ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కష్టమనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారు. దాన్ని రిఫ్రిజరేట్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుందని భావిస్తున్నారు. అయితే, అది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో బ్రెడ్ ఒకటి. దీన్ని గోధుమ పిండి లేదా మైదా పిండి, ఈస్ట్ కలిపి తయారు చేస్తారు. సరిగ్గా నిల్వ చేయకపోయినా లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచినా, బ్రెడ్డుకు బూజు పడుతుంది. చాలా మంది మిగిలిపోయిన బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ ఇలా బ్రెడ్ ను ఇలా ఫ్రిజ్‌లో ఉంచితే అది ఎండిపోతుంది. దాని రుచి కూడా తగ్గిపోతుంది. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన బ్రెడ్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బ్రెడ్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చూసుకోవడానికి, దానిని గది ఉష్ణోగ్రత వద్దనే స్టోర్ చేసుకోవాలి. అలాగే తేమ నుంచి దూరంగా ఉంచాలి. ఇలా చేస్తే బ్రెడ్ చెడిపోకుండా మరో రెండు రోజులు అదనంగా ఉంటుంది. 


ఇక రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు బ్రెడ్‌ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవద్దు. బ్రెడ్ ప్యాకెట్లను వంటగది లేదా డైనింగ్ టేబుల్ వద్ద కాకుండా.. పొడి ప్రదేశంలో విడిగా స్టోర్ చేసుకోవచ్చు. బ్రెడ్ ప్యాకెట్ తెరిచిన తర్వాత, దానిని గట్టి రబ్బర్ బ్యాండుతో మూసివేసి.. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేసుకోవచ్చు. బ్రెడ్ ముక్కలను నిల్వ చేయడానికి మీరు బ్రెడ్ బాక్స్ లేదా ఏదైనా ఇతర ప్లాస్టిక్ బ్యాగ్‌ని ఉపయోగించవచ్చు. బ్రెడ్‌ను ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో కూడా చుట్టవచ్చు. ఇలా చుట్టడం వల్ల బ్రెడ్ లోని తేమ బయటకు పోకుండా, ఎండిపోకుండా ఉంటుంది. 


బ్రెడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల బ్రెడ్‌లోని పోషక విలువలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.  రిఫ్రిజిరేటర్ లోని చల్లటి ఉష్ణోగ్రత బ్రెడ్ రుచిని తగ్గిస్తుంది. దీని వలన మీ బ్రెడ్‌లోని తేమ బయటకు పోయిన గట్టిపడుతుంది. తేమ లేకపోవడం వల్ల బ్రెడ్ పొడిగా, గట్టిగా మారుతుంది. అయితే బ్రెడ్ తాజాగా ఉన్నప్పుడు తినడం వల్ల దాని రుచితో పాటు పోషకాలు కూడా మనకు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం ఫ్రిజ్ లో ఉంచడం వల్ల బ్రెడ్ పై బూజు ఏర్పడుతుందని, కంటికి కనిపించేంత బూజు ఏర్పడినప్పటికీ, తిన్నప్పుడు ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Also Read : చలికాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయల జాబితా ఇదిగో


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply