దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు 20 వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 18,870 కేసులు నమోదుకాగా 378 మంది మరణించారు. 28,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.







  • మొత్తం కేసులు: 3,37,16,451

  • మొత్తం రికవరీలు: 3,29,86,180

  • మొత్తం మరణాలు: 4,47,751




  • యాక్టివ్ కేసులు: 2,82,520




  • మొత్తం వ్యాక్సినేషన్: 87,66,63,490 (గత 24 గంటల్లో 54,13,332)






కేరళ.. 


కేరళలో కొత్తగా 11,196 కేసులు నమోదయ్యాయి. 149 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 46,52,810కి చేరింది. 24,810 మంది మరణించారు. 


మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కొల్లాం, త్రిసూర్, ఎర్నాకులం, మలప్పురం, కొజికోడ్‌ ఇలా ఒక్కో జిల్లాలోనూ దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 2,844 కేసులు నమోదయ్యాయి. 60 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,44,606కు చేరగా ఇప్పటివరకు 1,38,962 మంది మృతి చెందారు.


Also Read: BSP MLA : పద్దతిగా లంచాలు తీసుకోవాలని ఉద్యోగులకు ఎమ్మెల్యే పాఠాలు ! ఇంకా నయం వాటాలు అడగలేదని సెటైర్లు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి