Sciatica Pain Relief Tips In Telugu | సయాటికా (Sciatica) అనేది నడుము నొప్పి. నడుము నుంచి కాళ్ల వరకు వ్యాపించే నాడీ నొప్పిగా చెప్పవచ్చు. ఈ నొప్పి సాధారణంగా సయాటిక్ నాడీ మీద ఒత్తిడి కలగడం వల్ల వస్తుంది. ఈ నొప్పి సాధారణంగా నడుము నుంచి తొడ ద్వారా పాదం వరకు వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సర్జరీ వరకు వెళ్తుంది. కానీ, చాలా మంది సయాటికా బాధితులు సర్జరీ లేకుండా కొన్ని టిప్స్, ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
వ్యాయామం మరియు ఫిజికల్ థెరపీ
- నడుము దగ్గర కండరాలు బలోపేతం చేసే వ్యాయామాలతో సయాటికా వల్ల కలిగే నొప్పి నుంచ ఉపశమనం కలిగించవచ్చు. కండరాలను బలంగా ఉంచడం ద్వారా నాడుల మీద ఒత్తిడి తగ్గుతుంది.
- ఫిజియోథెరపిస్ట్ సయాటికా బాధితులకు సరైన వ్యాయామాలను, శరీర భంగిమలను సూచిస్తారు, ఈ సూచనల ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు.
వార్మ్ కాంప్రెషన్ లేదా కోల్డ్ కాంప్రెషన్
వేడినీటి ప్యాడ్ల తో గోరువెచ్చని కాంప్రెషన్ నడుము దగ్గర ఇవ్వడం ద్వారా నొప్పి నుంచి కొంత ఉపశమనం దొరుకుతుంది.
కొన్నిసార్లు చల్లని ప్యాడ్ లేదా ఐస్ ప్యాక్స్ కూడా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా నరాలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి.
యోగ మరియు స్ట్రెచింగ్ వ్యాయామాలు
సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే సయాటికా నాడి మీద ఒత్తిడి తగ్గుతుంది. యోగా ద్వారా కూడా కండరాలు బలోపేతం అవుతాయి. ఫలితంగా నొప్పి తగ్గిస్తుంది. భుజంగాసనం వంటి కొన్ని యోగ ఆసనాలు సయాటిక నొప్పికి మంచి ఫలితాన్ని ఇస్తాయి.
మసాజ్ థెరపీ
మసాజ్ థెరపిస్ట్ సహాయంతో బిగుసుకున్న కండరాలను వదులుగా చెయ్యడం సాధ్యమవుతుంది. ఫలితంగా నాడుల మీద కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీని ద్వారా నొప్పి తగ్గుతుంది. శరీరానికి సౌకర్యం కలుగుతుంది.
నొప్పి తగ్గించే మందులు
- ప్రాథమిక పద్ధతులు పనిచేయనప్పుడు, వైద్యుల సలహా ప్రకారం నొప్పి నివారించే మందులు (NSAIDs) వాడవచ్చు. వీటి ద్వారా కలిగే ఉపశమనం తాత్కాలికమే.
- కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు నాడులపై ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
జీవనశైలి మార్పులు
- సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం సయాటికా నొప్పి తగ్గడానికి ఉపయోగ పడుతుంది.
- ఎక్కువ బరువు కలిగి ఉండడం నాడుల మీద ఒత్తిడి పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం చాలా ముఖ్యం.
- బరువులు ఎత్తే సమయంలో సరైన భంగిమలో వంగి బరువు చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా శరీరాన్ని తిరిగి నిటారుగా నిలపడం ద్వారా నరాలపై ఒత్తిడిని తగ్గించవచ్చు. సరైన విధానంలో బరువులు ఎత్తకపోవడం వల్ల కూడా సయాటికా నొప్పి మొదలు అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఆక్యుపంక్చర్
- కొన్ని సందర్భాల్లో ఆక్యుపంక్చర్ చికిత్స కూడా సయాటికా వల్ల కలిగే నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- ఆయుర్వేదంలో నడుము నొప్పి, సయాటికా నొప్పి తగ్గించడానికి అనేక రకాల ఆయుర్వేద నూనెలు, ఔషధాలను అందుబాటులో ఉన్నాయి.
- నిద్ర సమయంలో సౌకర్యంగా ఉండే మంచి పడక ఉపయోగించడం ద్వారా కూడా నొప్పిని కొంత అదుపు చెయ్యడం సాధ్యమవుతుంది. వెన్ను భాగాన్ని సపోర్ట్ చేసే పరుపును ఉపయోగించడం వల్ల సయాటికా సమస్య కలిగే ఇబ్బందిని కొంత మేర తగ్గించుకోవచ్చు.
- ఈ మార్గాల ద్వారా సర్జరీ అవసరం లేకుండానే సయాటికా వల్ల కలిగే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే పై జాగ్రత్తలన్నీ పాటించినా చాలా కాలం పాటు నొప్పి తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.