When Is Hepatitis An Emergency?: మన శరీరంలో చాలా అవయవాలు ఒకటి కంటే ఎక్కువ విధులు నిర్వహిస్తుంటాయి. అయితే దాదాపు ఐదు వందల కంటే ఎక్కువ పనులు చేస్తున్న ఆర్గాన్ మాత్రం కాలేయం. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి అందులో ఉండే విషయపదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు అన్నింటికీ బాస్‌ లీవరే. అందుకే లీవర్‌ ఫెయిల్యూర్‌ అయితే మల్టిపుల్ ఆర్గాన్స్‌ డ్యామేజ్ అవుతాయి. అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న లీవర్‌ను ప్రమాదంలోకి నెట్టేది హెపటైటిస్‌. ఒకసారి హెపటైటిస్‌ సోకిన తర్వాత సాధారణమైన కామెర్లు అనుకొని చాలా మంది లైట్ తీసుకుంటారు. ఏదో ఒక నాటు మందు తీసుకొని తగ్గిపోయిందనే భ్రమలో ఉంటారు.

Continues below advertisement

వైద్య నిపుణులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త అవసరం అని చెబుతుంటారు. ఈ హెపటైటిస్ చాలా సైలెంట్‌గా కాలేయాన్ని దెబ్బ తీస్తుందని, గంటల వ్యవధిలోనే పూర్తిగా డ్యామేజ్ చేసి మనిషి ప్రాణాలు తీస్తుందని చెబుతున్నారు. అలాంటి దాన్ని వైద్య పరిభాషలో ఫుల్మినెంట్‌ హెపటైటిస్‌ అంటారు. ఇది వచ్చింది అంటే మనిషి బతికే ఛాన్స్ చాలా తక్కువని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రాక ముందే మన బాడి కొన్ని సంకేతాలు ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి గురించి చూద్దాం. 

హెపటైటిస్ అంటే ఏంటీ? లోపల ఏం జరుగుతుంది?

హైపైటిస్ అంటే వాడుక భాషలో లీవర్‌ వాచిపోవడం అంటారు. ఇందులో చాలా వైరస్‌లు ఉన్నాయి హెపటైటిస్‌ A, B, C, D, E, ఉన్నాయి. ఇందులో మొదటి చివరి రెండు కూడా కలుషిత ఆహారం తిన్నప్పుడు, కలుషితమైన నీరు తాగినప్పుడు వస్తుంది. మిగతావి రక్తం, శారీరక ద్రవాలు, సురక్షితం కాని శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. 

Continues below advertisement

ఇలాంటి వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక శక్తి యాక్టివేట్ అవుతుంది. అయితే కాలేయానికి వైరస్ పట్టుకోవడం వల్ల దానిపై కూడా రోగనిరోధక శక్తి దాడి చేస్తుంది. దీంతో కాలేయాన్ని కూడా తినేస్తుంది. దీంతో తాను చేయాల్సిన ప్రాథమిక పనులు పూర్తిగా లీవర్ మానేస్తుంది. 

హెపటైటిస్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

చాలా మందిలో నార్మల్‌గా ఈ వ్యాధి సోకిన కొన్ని రోజుల వరకు ఆకలి వేయదు, అలసటగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కానీ బీ లేదా ఇ వైరస్ సోకినప్పుడు మాత్రం ప్రాణాంతకంగా మారవచ్చు. ఇది ఒకటి, రెండు శాతం కేసుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. వీళ్లకు అంతర్గతంగా డ్యామేజ ఎక్కువగా ఉంటుంది. కాలేయం కుళ్లిపోవడం ప్రారంభమవుుంది. ఇది క్రమంగా అక్యూట్ లీవర్‌ ఫెయిల్యూర్ అంటారు. దీంతో రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్ల తయారీ, అమ్మోనియా వంటి వ్యర్థాల ఫిల్టరింగ్ ఆగిపోతుంది. 

ప్రమాదకరంగా మారిందని ఎలా తెలుస్తుంది?

కాలేయం దెబ్బతిన్నప్పుడు అమ్మోనియాను యూరియాగా మార్చలేదు. దీంతో అమ్మోనియా మెదడులోకి చేరుతుంది. దీంతో వ్యక్తిలో విపరీతమైన నిద్ర, మతిమరుపు, గందరగోళం, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

మనకు ఏదైనా దెబ్బ తగిలితే కాసేపు రక్తం వస్తుంది. కానీ తర్వాత రక్తం గడ్డకడుతుంది. ఇలా రక్తంలోని గడ్డకట్టించే క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌ అన్నీ లీవర్‌లోనే ఉంటాయి. లీవర్ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తం కారడం ఎక్కువ అవుతుంది. 

కాలేయం పని చేయకపోతే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రక్తంలోని ప్లాస్మా ద్రవం పొట్ట భాగంలోకి లీక్ అవుతుంది. దీంతో రోగి పొట్ట ఉబ్బిపోతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. రోగి  ఏం తిన్నా సరే వాంతులు కావడం కూడా ఒక లక్షణం. దీని వల్ల త్వరగా డీహైడ్రేట్ అవుతారు. ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. 

లీవర్‌ ఉండే భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. రక్తంలో బిలిరుబిన్ స్థాయి 20 రెట్లు పెరగడం వల్ల కళ్లు, చర్మం నిమ్మకాయ రంగులోకి మారుతాయి. 

ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

అక్యూట్‌ లీవర్ ఫెయిల్యూర్ ఉన్న రోగికి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించాలి. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, హెపటాలజిస్ట్ అందుబాటులో ఉన్న, కాలేయ మార్పిడి సదుపాయం ఉన్న ఆసుపత్రిలో చేర్చాలి. చాలా మంది జ్వరం లేదా నొప్పి వస్తే పారాసిటమా్‌ మాత్రలు వేస్తుంటారు. కానీ దెబ్బతిన్న లీవర్‌పై పారాసిటమాల్‌ మరింత టాక్సిక్‌ ఎఫెక్ట్‌ను కలిగిస్తుంది. ఆసుపత్రిలో చేరిన రోగికి ఎల్‌ఎఫ్‌టీ, పీటీ-ఐఎన్‌ఆర్‌, రక్తంలో అమ్మోనియం స్థాయిలను కొలిచే పరీక్షలను చేయించాలి.