MCGS MSME Scheme: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (Mutual Credit Guarantee Scheme - MCGS-MSME) స్కీమ్‌ను ప్రకటించింది. పరిశ్రమలకు కావాల్సిన ప్లాంట్, మెషినరీ కొనుగోలు కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండా పెద్ద మొత్తంలో లోన్లు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ‌‌ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లై విధానం ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

పథకం ముఖ్య వివరాలు 

ఈ స్కీమ్‌లో ఒక కంపెనీ రూ.100 కోట్ల వరకు లోన్ అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ వ్యయం దీనికంటే ఎక్కువ ఉన్నా కూడా, గ్యారెంటీ మాత్రం రూ. 100 కోట్ల వరకే ఉంటుంది. మీరు తీసుకునే లోన్‌కు నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (NCGTC) ద్వారా 60% వరకు గ్యారెంటీ కవరేజీ ఇస్తారు. ఎగుమతులు చేసే ఎక్స్‌పోర్టర్ ఎంఎస్ఎంఈలకైతే 75% వరకు గ్యారెంటీ ఉంటుంది. పరిశ్రమలకు అవసరమైన కొత్త యంత్రాలు, ప్లాంట్ లేదా యాంత్రాల కొనుగోలు కోసం మాత్రమే ఈ టర్మ్ లోన్ ఇస్తారు. ప్రాజెక్ట్ మొత్తం ఖర్చులో కనీసం 60% నుండి 75% వరకు మెషినరీ కొనుగోలు కోసం ఉపయోగించాలి.  

లోన్ పీరియడ్ 

గరిష్టంగా 8 సంవత్సరాల పాటు లోన్ రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. ఇందులో 2 ఏళ్ల వరకు మారటోరియం ఉంటుంది. గరిష్టంగా 12 నుంచి 15 సంవత్సరాల వరకు రీపేమెంట్ సమయం, 3 సంవత్సరాల వరకు మారటోరియం లభించే ఛాన్స్ ఉంటుంది. 

Continues below advertisement

అర్హతలు 

MSME లోన్ తీసుకునే సంస్థ కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ (Udyam) పోర్టల్‌‌లో రిజిస్టర్ చేసుకుని, చెల్లుబాటు అయ్యే ఉద్యామ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండాలి. మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉన్న పరిశ్రమలకు, సర్వీస్ సెక్టార్, ఎక్స్‌పోర్టర్ MSMEలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. లోన్ అప్లై చేసుకునే సంస్థలు ఏ ఇతర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలోనూ డిఫాల్టర్‌గా ఉండకూడదు. కొత్తగా ప్రారంభించే ప్రాజెక్ట్‌లతో పాటు, ప్రస్తుతం ఉన్న కంపెనీల విస్తరణకు కోసం కూడా ఈ లోన్ తీసుకోవచ్చు.  Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!

కావాల్సిన డాక్యుమెంట్లు 

  • ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్  
  • PAN కార్డు, GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ లేదా కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్.
  • గత 2 నుంచి 3 ఏళ్ల పాటు ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లు, లాభనష్టాల ఖాతాలు, ఐటీ రిటర్న్స్.
  • గత 6 నుంచి 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ 
  • కొనుగోలు చేసే పరికరాల వివరాలు, వాటి కొటేషన్లు, ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే లాభాల ప్రాజెక్ట్ రిపోర్ట్ 
  • యజమానుల ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోలు  

గ్యారెంటీ ఫీజు 

ఈ స్కీమ్ కోసం ముందుగా కొంత నగదు జమ చేయాల్సి ఉంటుంది. లోన్ మొత్తంలో 5% ను NCGTC వద్ద డిపాజిట్ చేయాలి. మీరు లోన్ క్రమంగా చెల్లిస్తే 4వ సంవత్సరం నుంచి ఏటా 1% చొప్పున ఈ సొమ్మును తిరిగి రీఫండ్ చేస్తారు. ఎక్స్‌పోర్ట్ కంపెనీలకు అయితే 2% మాత్రమే డిపాజిట్ చేయాలి. మొదటి సంవత్సరం ఎలాంటి గ్యారెంటీ ఫీజు ఉండదు. ఆ తర్వాత లోన్ బకాయిపై ఏటా 1.5% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  Also Read: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు

ఎలా అప్లై చేసుకోవాలి?

  • ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థల ద్వారా అమలు చేస్తోంది. 
  • ఏ మెషినరీ కొనాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్ అవుతుందనే పూర్తి కొటేషన్లు సిద్ధం చేసుకోవాలి. 
  • మీ కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఉన్న లేదా ఈ పథకం కింద లోన్లు ఇచ్చే బ్యాంకును సంప్రదించి "Mutual Credit Guarantee Scheme (MCGS)" కింద లోన్ కావాలని అడగండి. 
  • ఉద్యమ్ సర్టిఫికేట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇతర పత్రాలు బ్యాంకు అధికారులకు అందించండి.  
  • బ్యాంక్ సిబ్బంది వ్యాపార సామర్థ్యాన్ని, క్రెడిట్ హిస్టరీని పరిశీలించి లోన్ అప్రూవ్ చేస్తారు.  
  • లోన్ అప్రూవ్ అయిన తర్వాత, బ్యాంకు వాళ్లే లోన్ అకౌంట్‌ను మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ పరిధిలోకి తీసుకురావడానికి NCGTC కి దరఖాస్తు పంపుతారు. 
  • 5% అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించిన తర్వాత లోన్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కుటుంబంతో కలిసిపోవడానికి ఓకే చెప్పేసిన భద్రావతి! వల్లీ, భద్రావతి ఏం చేయనున్నారు?