Milk Products: ఆహార పదార్ధాల్లో ఎన్ని ఉన్నా పాల ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది లేనిదే మన రోజు కూడా గడవదు అన్నట్టు ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టికాహారం చాలా ముఖ్యం. అయితే మనం ఎప్పుడు తింటామన్నదే ముఖ్యం. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పాలు మనకు ఔషధం లాంటివి. పాలు మనకు మంచి పోషకాహారం. పాలు తాగే అలవాటు మనిషి జీవితాంతం కొనసాగుతుంది. కొందరు లేవగానే వేడి వేడి పాలు తాగుతారు. మరి కొందరు పాలతో టీ, కాఫీ పెట్టుకుని తాగుతారు. పాలను స్వీట్స్, కూరల్లో, కేక్స్ లో ఎక్కువగా వాడుతుంటారు. కొందరికి ఇది లేనిదే వాళ్ల వ్యాపారం ముందుకు నడవదు. దీనితోనే బతికే వాళ్లు చాలా మంది ఉన్నారు. వైద్యులు కూడా రోజుకొక గ్లాస్ పాలు తాగమని సలహా ఇస్తుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు మిల్క్ ను రోజూ తీసుకుంటూనే ఉంటారు. మరి ఇంతలా మన జీవితంలో భాగమైన పాలను ఒక నెల పాటు దూరం పెడితే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక , భావోద్వేగ అంశాలను కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒకేసారి నిలిపివేస్తే మన శరీరంలో ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక నెల పాటు డైరీ ప్రొడక్ట్స్ ఆపడం వల్ల మన శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థ పై సానుకూల , ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ మార్పులకు వ్యక్తిగత ప్రతిస్పందనలు మారవచ్చుని నిపుణులు చెబుతున్నారు. పాల వినియోగాన్ని నిలిపివేసిన నాలుగు వారాల్లోనే చర్మ సమస్యలు వస్తాయని అంటున్నారు. కొన్ని అధ్యయనాలు ప్రకారం అయితే, పాల వినియోగం మొటిమల మధ్య సంబంధాన్ని సూచిస్తున్నాయి,అయితే ఇంత ప్రమాదకరం కాదు. పాల ఉత్పత్తులు కాల్షియానికి ముఖ్యమైన మూలమని మనందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి, వాటిని ఆపడం వల్ల కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్ మొదలైన పోషకాల లోపాలు వస్తాయి. వీటికి బదులుగా పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, అత్తి పండ్లు, సోయా, బ్రోకలీ మొదలైన ఆహారాలను తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకుంటే మన ఎముకలు కూడా బలంగా ఉంటాయి. తగినంత కాల్షియం తీసుకోవడం శరీరానికి అవసరం. ఇది ఎముక సాంద్రతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి శరీరానికి అవసరమ్యే ఫుడ్స్ ను తీసుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోండి.
Also Read : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.