Healthy Diwali : పండుగ వేళ కడుపు నిండా తినడమే పనిగా ఉంటుంది. ఒకవేళ మీరు తినకపోయినా ఇంట్లో వాళ్లు బలవంతంగా అయినా తినిపించేస్తారు. స్ట్రిక్ట్​ డైట్ పాటిస్తూ.. మీరు ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకున్నా.. లేదంటే ఒకేసారి వివిధ రకాల ఫుడ్స్ తీసుకున్నా మీకు కడుపు సమస్యలు మొదలవుతాయి. కాబట్టి పండుగ సమయంలో 'డైట్'​ను ఎలా మెయింటైన్ చేయాలి? ఎలాంటి 'డ్రింక్స్' తాగాలి? ఇవన్నీ చేసిన తర్వాత శరీరాన్ని ఎలా 'డిటాక్స్' చేయాలనే దానిపై కనీస అవగాహన ఉండాలి. ఇది మీరు పండుగ ముందు, తర్వాత కూడా హెల్తీగా ఉండేలా చేస్తుంది. 


డైట్​ కేర్..


దీపావళి స్వీట్లకు పెట్టింది పేరు. ఇంట్లో తయారు చేసుకునేవే కాకుండా.. బంధు, మిత్రులు రకరకాల స్వీట్లు ఇస్తారు. పోనిలే మీరు డైటింగ్​లో ఉన్నారని మీరు లో క్యాలరీ స్వీట్స్​ తీసుకున్నా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మార్కెట్లలో డిమాండ్, టేస్ట్ కోసం వారు ఇతర కెమికల్స్, స్వీట్​నర్స్ ఉపయోగిస్తారు. ఇది పక్కన పెడితో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్​ స్థాయిలను పెంచే పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతాయి. 


కాబట్టి మీ స్నేహితులకు, బంధువులకు స్వీట్స్​కు బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. మిల్లెట్స్, తృణధాన్యాలతో మీరు స్నాక్స్ తయారు చేయవచ్చు. మీ అతిథులకు కూల్ డ్రింక్స్, టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీలు ఇవ్వండి. ఇది మీకు, మీ బంధుమిత్రుల ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. 


డ్రింక్స్.. 


పండుగ వేళ మందు తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. అయితే మీరు డ్రింక్ చేసుకుంటూ కూర్చుంటే.. మీ కుటంబంతో హాయిగా గడిపేది ఎవరు? కాబట్టి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించండి. ఇలా చేయడం వల్ల మీరు మందుకు దూరంగా ఉంటారు.


పండుగ సమయంలో ఉండే హడావిడిలో పడి నీరు తాగడం అశ్రద్ధ చేయవద్దు. శరీరంలో నీటి స్థాయిలు తగ్గితే మెరుగైన జీర్ణ క్రియ ఉండదు. మీరు కూడా త్వరగా అలసిపోతారు. మొహంలో కళ పోయి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి పండుగ సమయంలో ఏది ఏమైనా.. కనీసం 6 గ్లాసుల నీరు తాగండి.


తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గ్రీన్ టీ వంటివి కూడా మీరు హైడ్రెటెడ్​గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. మీరు పండుగ సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే ఇవి మిమ్మల్ని బాగా హైడ్రేట్ చేస్తాయి. 


డిటాక్స్..


పండుగ సమయంలో ఇంటితో పాటు.. మన శరీరం కూడా శుభ్రంగా ఉండాలి. శరీర, చర్మ సంరక్షణ కోసం మీరు కొన్ని డిటాక్స్​ డ్రింక్స్ ట్రై చేయవచ్చు. పండుగ ప్రారంభమవకముందే మీరు వీటిని ఫాలో అయితే.. ఫెస్టివల్ సమయంలో మీరు మరింత ఫ్రెష్​, పింపుల్స్ లేని స్కిన్​ను పొందవచ్చు. 


కాబట్టి ముందు నుంచే తినే ఆహారంపై శ్రద్ధ వహించండి. జింక్ ఎక్కువగా ఉండే నట్స్, తృణధాన్యాలు మీ డైట్​లో చేర్చుకోవచ్చు. సీఫుడ్, పండ్లు, కూరగాయలు.. ముఖ్యంగా సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మీ శరీరాన్ని డిటాక్స్ చేసి.. చర్మానికి మెరుపును అందిస్తాయి. టొమాటోలు వంటివి.. టపాసులు పేల్చడం వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్స్​ నుంచి కాపాడుతాయి. ఇవేకాకుండా పప్పులు, చిక్కుళ్లు, పండ్లతో మీ ఆహారంలో ఫైబర్​ను పెంచుకోండి. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 


ఇవి పండుగ ముందు అయితే.. పండుగ తర్వాత కూడా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. దీపావళి తర్వాత రోజు ఉపవాసం చేయండి. ఇది దీపావళికి ముందు.. దీపావళి రోజు శరీరంలో పేరుకుపోయిన విషాలను తొలగించడంలో సహాయం చేస్తుంది. ఒక హెల్తీ వాతావరణంలో పండుగ చేసుకునేందుకు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 


Also Read : దీపావళికి మీరు ఈ డ్రెస్​ల్లో సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్​గా కనిపిస్తారు తెలుసా?