కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15- 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.






2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15-18 ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీకి చెందిన 59 శాతం మంది పిల్లలు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది.


దిల్లీలో సడలింపు..


మరోవైపు దిల్లీలో కరోనా ఆంక్షలను సడలించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.



  • ప్రస్తుతం అమలులో ఉన్న వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసింది ప్రభుత్వం.

  • దుకాణాలపై ఉన్న సరి-బేసి విధానాన్ని కూడా తొలగించింది.

  • నగరంలోని రెస్టారెంట్లు, బార్లకు 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి.

  • ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

  • బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లి వేడుకలకు అత్యధికంగా 200 అతిథులు హాజరు కావచ్చు.

  • ఇండోర్​ వెన్యూలలో 50 శాతం సామర్థ్యంతో వేడుకలు నిర్వహించుకోవచ్చు.

  • అయితే పాఠశాలల పునఃప్రారంభంపై మాత్రం తదుపరి చర్చల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.


Also Read: Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!


Also Read: Arunachal Boy Missing Case: అరుణాచల్‌ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా