దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 16,051 కరోనా కేసులు నమోదయ్యాయి. 206 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 1.93%గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,02,131కి చేరింది.
కరోనా కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరుస్తున్నారు.
దిల్లీలో కొత్తగా 570 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 1.04గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 18,56,071గా ఉంది. మరణాల సంఖ్య 26,101కి పెరిగింది.
థర్డ్ వేవ్‌లో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులో 28,867 కేసులు దిల్లీలో నమోదయ్యాయి. అయితే జనవరి 13 నుంచి కేసులు క్రమంగా తగ్గాయి.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 1,437 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 78,58,431కి పెరిగింది. మరణాల సంఖ్య 1,43,582కు చేరింది.
వ్యాక్సినేషన్
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. కొత్తగా 7,00,706 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,46,25,710కు చేరింది.