దేశంలో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదుకాగా 491 మంది మృతిచెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822కు చేరింది. మొత్తం కేసుల్లో ఇది 1.27 శాతం. వీక్లీ పాజిటివ్ రేటు ప్రస్తుతం 2.38 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివ్ రేట్ 2.27%గా ఉంది. గత 13 రోజులుగా డైలీ పాజిటివ్ రేట్ 3% కన్నా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
కేరళలో..
కేరళలో కొత్తగా 20,367 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 139 మంది కరోనా కాటుకు బలయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,78,166కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,654కు పెరిగింది. టెస్ట్ పాజిటివ్ రేటు 13.35 శాతంగా ఉంది.
ఆగస్టు 9 నుంచి 31 వరకు కేరళలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదుకాగా 128 మంది మరణించారు. ముందురోజుతో పోలిస్తే కరోనా కేసులు సంఖ్య కొంచెం పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 6,347,820కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 133,845కి పెరిగింది. మొత్తం 6,139,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వాణిజ్య రాజధాని ముంబయిలో కొత్తగా 332 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 737,192కి చేరగా మరణాల సంఖ్య 15,942కి పెరిగింది. కరోనా ఆంక్షలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సడలించిన నాటి నుంచి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.
వ్యాక్సినేషన్..
ఇప్పటివరకు రాష్ట్రాలు, యూటీలకు 52.37 కోట్ల (52,37,50,890) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 8,99,260 డోసులు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.