దేశంలో కొత్తగా 30,549 కేసులు నమోదయ్యాయి. 422 మంది చనిపోయారు. 38,887 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.38% శాతంగా ఉంది. 



  • మొత్తం కేసులు: 3,17,26,507

  • మొత్తం రికవరీలు: 3,08,96,354

  • మొత్తం మరణాలు: 4,25,195

  • యాక్టివ్ కేసులు: 4,04,958

  • మొత్తం వ్యాక్సినేషన్ : 47,85,44,114 ( గత 24 గంటల్లో 61,09,587)


దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,04,958గా ఉంది. మొత్తం కేసుల్లో ఇది 1.28%. వీక్లీ పాజిటివ్ రేట్ 5 శాతం కంటే తక్కువే ఉంది. ప్రస్తుతం 2.39%గా ఉంది.


మహారాష్ట్రలో..


మహారాష్ట్రలో కొత్తగా 4,869 కేసులు నమోదుకాగా 90 మంది కరోనాతో మృతి చెందారు.8,429 మంది కరోనాను జయించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,15,063కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,33,038కి పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 


ALSO READ:


Covid-19 Transmission: కరోనా రోగి కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి.. ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే


రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 61,03,325కి పెరగగా 75,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.65 శాతానికి చేరింది.


మరణాల రేటు 2.1 శాతంగా ఉంది. ముంబయిలో కొత్తగా 259 కేసులు నమోదయ్యాయి, 9 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 7,35,366కి పెరగగా మొత్తం మరణాలు 15,908గా ఉంది.


కేరళలో విజృంభణ..


కేరళలో కొత్తగా 13,984 కేసులు నమోదుకాగా 15,923 మంది రికవరయ్యారు. 118 మంది చనిపోయారు. పాజిటివిటీ రేట్ 10.93% ఉంది.


రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,65,322గా ఉంది. మొత్తం రికవరీల సంఖ్య 32,42,684కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 16,955కి పెరిగింది.


అక్టోబర్ లో పీక్..


హైదరాబాద్, కాన్పుర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నలజీ (ఐఐటీ) పరిశోధకులు కొవిడ్ థర్డ్ వేవ్ ఆగస్ట్ చివరివారంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఈ వేవ్ లో కరోనా కేసులు రోజుకు లక్ష నుంచి లక్ష 50 వేలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే సెకండ్ వేవ్ లానే థర్డ్ వేవ్ కూడా దారుణంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూరం తప్పక పాటించాలని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించొందని హెచ్చరిస్తున్నారు.


థర్డ్ వేవ్ ఆగస్టు చివరి వారంలో మొదలైనప్పటికీ అక్టోబర్ లో పీక్ లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని.. తగిన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


ALSO READ:


Petrol-Diesel Price, 3 August: ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు.. ఇక్కడ మాత్రం స్థిరంగానే.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ..