Corona Fear :  దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు ఎనిమిది వేలు దాటిపోాయి.   24 గంటల్లో 8,329కి చేరినట్లుగా కేంద్రం చెబుతోంది. ముంబై , ఢిల్లీలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.  దేశంలో జనవరిలో కరోనా థర్డ్‌ వేవ్‌ అనంతరం మళ్లీ కేసులు ఇంత వేగంగంగా పెరగడం ఇదే తొలిసారి. 103 రోజుల్లో తొలిసారిగా రోజువారీ కేసులు 8వేల మార్క్‌ను దాటాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం మహారాష్ట్ర, కేరళ నుంచే రికార్డవుతున్నాయి. 


నాలుగో వేవ్ అని చెప్పలేమంటున్న కేంద్రం !
 
భారతదేశంలో పెరుగుతున్న కేసుల పెరుగుదల నేపథ్యంలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.  పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని నాల్గో వేవ్‌ అని ఇంత త్వరగా చెప్పలేని కేంద్ర ఆరోగ్య అధికారులు అంటున్నారు. సమాచారం అంతా క్రోడీకరించుకున్న తర్వాతనే దీనిపై ప్రకటన చేయాల్సి ఉంటుందంటున్నారు. అయితే అన్ని చోట్ల నుంచి కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 


రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సూచనలు !


కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రయత్నాలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. మహమ్మారి పరిస్థితిని నియంత్రించేందుకు కృషి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖలో కోరారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా వ్యక్తిగతం వైరస్‌ వ్యాప్తి చెందకుండా, నివారణకు చర్యలు తీసుకుంటూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మాస్క్‌ ధరించడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని నిపుణులు స్పష్టం చేశారు.  ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాలు తమ పౌరులకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. 


కోరనా నుంచి కోలుకున్న పిల్లలకు కొత్త రకం సిండ్రోమ్ !


క‌రోనా వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ త‌ర్వాత చాలామంది పిల్ల‌ల్లో ప్రాణాంత‌క మ‌ల్టీ సిస్ట‌మ్‌ ఇన్ఫ్ల‌మేట‌రీ సిండ్రోమ్ (ఎంఐఎస్‌-సీ) క‌నిపించింద‌ని ఓ కొత్త అధ్య‌య‌నంలో తేలింది. వ్యాక్సినేష‌న్ వేసుకోని పిల్ల‌ల‌తోపాటు వ్యాక్సిన్ తీసుకున్న పిల్ల‌ల్లో కూడా ఇది క‌నిపించింద‌ని తేల్చారు. ఒమిక్రాన్ సంక్ర‌మ‌ణ త‌ర్వాత అర మిలియ‌న్ కంటే ఎక్కువ మంది పిల్ల‌లు, టీనేజ‌ర్ల‌పై డెన్మార్క్‌ ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేశారు. వీరిలో చాలామంది పిల్ల‌ల్లో ఎంఐఎస్‌సీ-సీ ఉన్న‌ట్లు గుర్తించారు.  ఇది అరుదైన సిండ్రోమ్ అయిన‌ప్ప‌టికీ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెద‌డులాంటి కీల‌క భాగాల్లో వాపు ఉంటుంద‌ని పరిశోధ‌కులు చెబుతున్నారు.