COVIDUpdates:ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు వందకుపై నమోదయ్యాయి. నిన్న వందలోపు రిజిస్టర్ అయిన కేసులు ఇవాళ కాస్త పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పదకొండు వేల ఐదువందల డెబ్భై ఒక శాంపిల్స్ తీసుకును పరీక్షిస్తే... 141 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. గుంటూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు.
450 రికవరీ
ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల యాభై మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వాళ్లందరికీ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,31, 17, 181 శాంపిల్స్ తీసుకొని పరీక్షించారు. అందులో ఇప్పటి వరకు 23, 17, 953 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో పద్నాలుగు వేల 729 మంది మరణించారు.
చికిత్సలో రెండు వేల మంది
ప్రస్తుతం కరోనా బారిన పడి రెండు వేల పద్నాలుగు మంది చికిత్స తీసుకుంటున్నారు.
గత ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వారీగా చూస్తే ఎక్కువ కేసులు కృష్ణా జిల్లాలో రిజిస్టర్ అయ్యాయి. అక్కడ నలభై ఒక్క కేసులు వెలుగు చూసింది. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. అక్కడ 23 కేసులు నమోదయ్యాయి.
కర్నూలు జిల్లాలో అదుపులోకి కరోనా
కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళంజిల్లాలో ఒక్క కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత స్థానంలో విజయనగరం ఉంది.
నిన్న మూడు జిల్లాల్లో సున్నా కేసులు
నిన్న మూడు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
యాక్టివ్ కేసుల్లో తూర్పు టాప్
ఆరు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు ఉన్నాయి. కర్నూలులో కేసుల సంఖ్య జీరోకు చేరింది. ప్రస్తుతం అక్కడ పద్నాలుగే యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో చూస్తే తూర్పుగోదావరి టాప్‌లో ఉంది. అక్కడే ఎక్కువ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 791 యాక్టివ్ కేసులు ఉన్నాయి.