మనలో చాలా మందికి నిద్రపోయేటప్పుడు పాలు తాగి పడుకోవడం అలవాటు. అదే అలవాటుతో మాంసాహారం తిన్నా తర్వాత కూడా తాగుతాం. రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో కూడా నాన్ వెజ్ తిన్నా తర్వాత మిల్క్ షేక్ తాగడం లేదా పాలతో తయారు చేసిన పదార్థాలు తినడం చేస్తాం. అలా చెయ్యడం ఆరోగ్యానికి ప్రమాదమని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది మన జీర్ణ క్రియని దెబ్బ తీయడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలని తెచ్చి పెడుతుందని అంటున్నారు. కొన్ని పదార్థాలని కొన్నిటితో కలిపి తినడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.  సరైన ఆహార పదార్థాల కాంబినేషన్ తోనే మనం తినాలని చెబుతున్నారు. వాత, పిత, కఫాలలో సమతుల్యత లోపిస్తుంది. అవి సరిగా లేకపోతే మన శరీరం అనారోగ్యానికి గురవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకే మన ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు కూడా మాంసాహారం తిన్న తర్వాత పెరుగు తినకూడదని చెప్తారు.

  


చికెన్ తిన్న తర్వాత పాలు తీసుకుంటే వచ్చే అనార్థాలు..  


చికెన్ తిన్న తర్వాత పాలతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థకి ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే అవి రెండు వేర్వేరు గుణాలని కలిగి ఉండే పదార్థాలు. ఇవి రెండు కలిపి తినడం వల్ల మన పొట్టలో హానికర యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అది మన జీర్ణప్రక్రియని దెబ్బతీస్తుంది. దీని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. అంతే  కాకుండా కడుపులో వికారం, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన చర్మ సమస్యలు, మల బద్దకం వంటి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది.


ఒక వేళ మీరు మాంసాహారం తిన్న తర్వాత కూడా పాల పదార్థాలు తీసుకోవాలని అనుకుంటే ఆ రెండిటికి మద్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ వాదాన్ని డైటీషియన్స్ కొట్టి పడేస్తున్నారు. అలాంటి సమస్యలేమీ ఉండవని అంటున్నారు. చికెన్ లేదా చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల ఎటువంటి హానికర ప్రభావాలు ఉండవని పోషకాహార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చికెన్, చేప వంటి పదార్థాలు జీర్ణమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అవి తిన్న తర్వాత లిక్విడ్ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియను కొద్దిగా మందగించేలా చేస్తుంది. మాంసాహారం తిన్న తర్వాత లిక్విడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుందని అంతే కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని పోషకాహార నిపుణులు అంటున్నారు.


Also read: ఈ ఉల్లిపాయ మగవారు తింటే ఆ విషయంలో తిరుగుండదట!




Also read: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే