Patanjali Ayurved: ఆయుర్వేదానికి పుట్టినిల్లు అయిన భారత్‌లో ఆయుర్వేదం ఇప్పుడు ప్రధాన పరిశ్రమగా మారింది. వాణిజ్యపరంగానూ ఆయుర్వేదం బలపడుతోంది.ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది.సహజ సిద్ధమైన చికిత్సలపై ప్రజల విశ్వాసం బలపడుతున్నట్లు ఇది సూచిస్తోంది. ఉత్పత్తుల అందించే భద్రత,  ప్రభావవంతమైన  ఫలితాలే ఈ ఆదరణ వెనుక ప్రధాన కారణం అని పతంజలి ఆయుర్వేదం తెలిపింది. ఆయుర్వేదాన్ని ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలతో సమన్వయం చేస్తూ, పతంజలి తన పరిశోధన మరియు అభివృద్ధి (R&D) ల్యాబ్‌ల ద్వారా ప్రపంచ స్థాయి ఔషధ వ్యవస్థగా ఆయుర్వేదాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.

అత్యాధునిక సాంకేతికతతో పరిశోధనలుపతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ (PRF) అత్యాధునిక సాంకేతికత, వైజ్ఞానిక విధానాలను అనుసరిస్తూ, సురక్షితమైన, ప్రభావవంతమైన ఉత్పత్తులను అందించడానికి సహకరిస్తుంది. 300 మందికి పైగా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఈ ల్యాబ్‌లలో మూలిక, సహజ ఉత్పత్తులపై లోతైన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నం ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా 'ఎవిడెన్స్-బేస్డ్ మెడిసిన్'గా నిరూపించడానికి దోహదపడుతుంది. 

ఉత్తమ నాణ్యతతో ముడిసరుకుల ఎంపిక

ఆయుర్వేద ఉత్పత్తులను సురక్షితంగానూ.. ప్రభావవంతంగా తీసుకురావడానికి పతంజలి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ముడి సరుకులు అత్యంత నాణ్యమైనవి ఎంపిక చేస్తారు. "R&D ప్రక్రియ ముడిసరుకుల ఎంపికతో ప్రారంభమవుతుంది. నాణ్యత కలిగిన మూలికలు సహజ పదార్థాలను ఎంచుకోవడంతో పాటు, అత్యాధునిక మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో వీటి స్వచ్ఛత మరియు నాణ్యతను పరీక్షిస్తారు. ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి జంతు ,మానవ పరీక్షలు నిర్వహిస్తారు. పతంజలి  ఇన్-వివో ల్యాబ్‌లు కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్‌విజన్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్ (CCSEA) గుర్తింపు పొందాయి, ఇది నైతిక , వైజ్ఞానిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయని" పతంజలి చెబుతోంది. 

NABL, DSIR, మరియు DBT వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలచే గుర్తింపు పొందిన పరికరాలను ల్యాబ్‌లలో ఉపయోగిస్తారు. ఈ పరికరాలు ఆయుర్వేద ఫార్ములేషన్‌లను వైజ్ఞానికంగా అభివృద్ధి చేయడంలో  పరీక్షించడంలో సహాయపడతాయి. ప్రతి ఉత్పత్తికి stability, toxicity and effectiveness  ను అత్యంత కఠిన పరిక్షల ద్వారా పరీక్షిస్తారు. దాహరణకు, పతంజలి చ్యవనప్రాశ్ , హెర్బల్ సబ్బులు వాటి నాణ్యత  ప్రభావం కారణంగా  జనాల్లో మంచి ఆదరణ పొందాయి, ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఆయుర్వేదం యొక్క విశ్వసనీయతను పెంచడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. 

ఆత్మనిర్భర్ భారత్ దిశగా చొరవ

పతంజలి R&D ల్యాబ్‌లు ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సాధికారపరుస్తాయి. స్థానిక రైతులు, మూలికా ఉత్పత్తిదారులతో భాగస్వామ్యం ద్వారా, కంపెనీ ఆత్మనిర్భర్ భారత్‌ని సాకారం చేస్తోంది. ఈ ప్రయత్నం ఆయుర్వేదాన్ని ఆధునిక ఆరోగ్య సంరక్షణలో అంతర్భాగంగా మార్చడంలో కీలకమైన దశగా నిలుస్తుంది.ప్రపంచ ఆరోగ్య విప్లవంలో భాగస్వామ్యంపతంజలి ఆయుర్వేదం భారతీయ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో కలపడం ద్వారా ప్రపంచ ఆరోగ్య విప్లవంలో ముందంజలో ఉంది. ఈ క్రమంలో, స్థానిక సమాజాలను బలోపేతం చేయడం, స్థిరమైన ఉత్పత్తి పద్ధతులను ప్రోత్సహించడం,  సహజ ఔషధాల ద్వారా ఆరోగ్య సంరక్షణను  అందరికీ అందుబాటులోకి తేవడం వంటి అంశాలపై దృష్టి సారించింది.