సమ్మర్లో వేడిని అధిగమించేందుకు ఎక్కువగా జ్యూస్, షేక్స్, స్మూతీస్ ని తీసుకుంటారు. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే పోషకాలతో నిండి ఉండటమే కాదు త్వరగా జీర్ణం అవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి. రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు సహకరిస్తాయి. మామిడి, అరటి, బెర్రీస్, దానిమ్మ, పుచ్చకాయ ఇలా అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. మిగతా వాటి కంటే చాలా మంది మామిడి, బనానా షేక్ తాగేందుకు ఇష్టం చూపిస్తారు. అయితే పండ్లను పాలతో కలుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను మూలంగా ఉండే విషపూరితమైన ఉత్పత్తులని విడుదల చేస్తాయని హెచ్చరిస్తున్నారు.


మ్యాంగో షేక్ Vs బనానా షేక్


ఆయుర్వేదం ప్రకారం అన్ని పండ్లు పాలతో కలపడం సరికాదు. తీపి, పూర్తిగా పండిన పండ్లు మాత్రమే పాలతో కలిపి షేక్ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. మామిడి, అరటి రెండూ తియ్యగా ఉంటాయి. వీటిని ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ లో మామిడి, అరటి మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఇష్టం చూపిస్తారు. అయితే నిజానికి ఇవి రెండూ ఆరోగ్యకరమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? పండ్ల ప్రకారం చూసుకుంటే ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


అరటి పండు షేక్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అంటే ఆయుర్వేదం ప్రకారం మేలు చేయదని అంటున్నారు. ఈ పండు తీపిగా ఉండవచ్చు కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారుతుంది. ఇది పాలతో వినియోగానికి పనికి రాడు. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే అరటి పండు షేక్ మితంగా మాత్రమే తీసుకోవాలి.


పండిన తీపి మామిడిని పాలతో కలపవచ్చు. ఇది పాలతో కలపడం వల్ల వాత, పిత్త దోషాలను శాంతపరుస్తుంది. రుచికరమైనది, పోషకాలతో నిండి ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. అంటే మీరు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మామిడి పండు షేక్ ని తీసుకోవచ్చు. అయితే ఏవైనా దీర్ఘకాలిక పరిస్థితితో బాధపడుతుంటే ఆరోగ్య నిపుణుడి సలహా మేరకు తీసుకోవాలి.


ఇవి పాలతో కలపొచ్చు


☀పాలను పూర్తిగా తీపి, పండిన పండ్లతో మాత్రమే కలపాలి. పండిన తీపి మామిడిని పాలతో కలపవచ్చు.


☀అవకాడో పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇది కాస్త క్రీమ్ గా ఉంటుంది.


☀ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పండు(అంజీరా)వంటి డ్రై ఫ్రూట్స్ ని పాలతో కలిపి తీసుకోవచ్చు.


☀అన్ని బెర్రీలను(స్ట్రాబెర్రీలతో సహా) పాలతో అసలు కలపకూడదు. పాలతో బెర్రీలను జోడించినప్పుడు పాలు వెంటనే విరిగిపోతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కాటన్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటే అలా జరుగుతుందా?