భారతీయుల ఇళ్ళలో తప్పనిసరిగా నెయ్యికి ప్రాధాన్యత ఇస్తారు. పోషకాలు నిండిన నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని భాగాల పని తీరు సజావుగా సాగేలా చేస్తుంది. దీని అధ్బుతమైన రుచి, వాసనకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర కొవ్వుని తగ్గిస్తుంది. ఎముకలు, కీళ్లని బలపరుస్తుంది. రక్తాన్నిశుద్ది చేస్తుంది. శరీర కణజాలాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వు జీర్ణాశయాంతర పేగులోని ఆమ్ల pHని తగ్గిస్తాయి. దీన్ని సరైన సమయంలో తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


నెయ్యి తినేందుకు అనువైన సమయం ఏది?


సాధారణంగా భారతీయులు నెయ్యిని టాపింగ్ గా ఉపయోగిస్తారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖాళీ కడుపుతో నెయ్యిని కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్యాలని నయం చేసుకోవచ్చు. బరువు తగ్గేందుకు కూడా నెయ్యి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు అనేక ప్రయోజనాలు అందిస్తుంది.


జీర్ణక్రియ మెరుగు


నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. విరేచనాలు వంటి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వివిధ వ్యాధుల్ని నివారించడంలో చక్కగా పని చేస్తుంది. వర్షాకాలంలో పొట్ట, జీర్ణక్రియకి సమస్యలు ఎక్కువగా తెస్తుంది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో కలిపి నెయ్యి తీసుకుంటే జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి. పేగు గోడల్ని శుభ్రం చేస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలని నివారిస్తుంది.


టాక్సిన్స్ తొలగింపు


ఉదయాన్నే ఒక టీ సూపన నెయ్యి తీసుకుంటే శరీరం నుంచి టాక్సిన్స్, కొవ్వుని బయటకి పంపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నెయ్యి ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొత్తం కొలెస్ట్రాల్ ని 10-20 శాతం వరకు తగ్గిస్తుంది.


రక్త ప్రసరణ


బరువు నియంత్రణకు సహాయపడే గుణాలు, అమైనో ఆమ్లాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తాయి. శరీరమంతా రక్త ప్రసరణ వేగవంతంగా జరిగేలా చేస్తుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.


కళ్లకు మంచిది


గోరువెచ్చని నీరు, ఒక టీ స్పూన్ నెయ్యి కళ్ళకి మేలు చేస్తుంది. కంప్యూటర్లు, ఫోన్లు, టెలివిజన్ అధికంగా చూడటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి దృష్టి సంబంధిత సమస్యలు నయం చేయడంలో సహాయపడతాయి. కళ్ళు పొడిబారడం, అలసట, నల్లటి వలయాలు తగ్గిస్తాయి.


ఎముకలకు పుష్టి


ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్ళు వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు. అటువంటి వాళ్ళు ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్న స్త్రీలు ప్రతి రోజూ ఉదయం అల్పాహారానికి ముందు నెయ్యి తీసుకుంటే ఆ లోపం నుంచి బయట పడొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: తరచుగా చెవులు మూసుకుపోతున్నాయా? ఈ అరుదైన క్యాన్సర్ లక్షణం కావచ్చు