కీర దోసకాయను చాలామంది ఇష్టంగా తింటారు. 96 శాతం నీటితో నిండి ఉంటుంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. చర్మంపై నల్లటి వలయాలు పోగొట్టేందుకు పని చేస్తుంది. అంతే కాదు వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. ఇది వేసవిలో ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుతుంది. దీన్ని చాలా మంది సలాడ్, శాండ్ విచ్, సైడ్ డిష్ లో భాగంగా భోజనంతో పాటు తీసుకుంటారు. బహుళ ప్రయోజనాలు అందించే కీర దోసకాయ అన్ని రకాల వాతావరణంలో తినొచ్చని అనుకుంటారు. కానీ శీతాకాలంలో మాత్రం ఇది తినకపోవడమే మంచిది.


ఆయుర్వేదం ప్రకారం కీర దోసకాయలో మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. సీత(శీతలీకరణ), రోషన్(వైద్యం) కషాయ(ఆస్ట్రిజెంట్). ఇది మొక్కల ఆధారిత ఆహార పదార్థం. అంటే దీని లక్షణాలన్నీ సేంద్రీయంగానే ఉంటాయి. శరీరాన్ని చల్లబరుస్తుంది. కడుపులో వేడిని ఉత్పత్తి చేసే ఔషధం లేదా ఏదైనా ఆహార పదార్థం వల్ల వచ్చే అలర్జీలను తగ్గిస్తుంది. కాలిన గాయాలు, మొటిమలు, శరీర దద్దుర్లకి చికిత్స చేస్తుంది. శరీరంలోని కఫ, వాత, పిత దోషాలని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. అయితే ఇందులోని శీతలీకరణ గుణం వల్ల చలికాలంలో తినడం మంచిది కాదు.


చలికాలంలో కీర దోసకాయ ఎందుకు తినకూడదు?


సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కీర దోసకాయ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది సహజ ఆస్ట్రిజెంట్ లక్షణాలకి కలిగి ఉంటుంది. దీని శరీరం వెచ్చగా ఉండకుండా మరింత చల్లదనం ఇస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కీర దోసకాయ తినడం లేదా దాని రసం తాగడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో అది జలుబుని మరింత ఎక్కువ చేస్తుంది. ఒకవేళ కీర దోసకాయని చలికాలంలో తీసుకోకుండా ఉండలేకపోతే పగటి పూట మాత్రమే తినాలి. రాత్రి వేళ మాత్రం తప్పనిసరిగా విస్మరించాలి. శరీర సహజ ఉష్ణోగ్రత కారణంగా ఎండగా ఉన్నప్పుడు దోసకాయ తినడం వల్ల శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.


అతిగా తినకూడదు


ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని రకాల కీర దోసకాయలు చేదుగా ఉంటాయి. వాటిని తినడం వల్ల అందులోని హానికర రసాయనాలు పొట్టలో చెరిపోయి విషపూరితం కావొచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకమైన అలర్జీలకి కారణం అవుతుంది. కీర దోసకాయలో పొటాషియం ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకుంటే పొటాషియం అడికంగా శరీరంలోకి చెరిపోతుంది. దీంతో హైపర్ కలేమియా వంటి ఆరోగ్య పరిస్థితులు వస్తాయి. పొట్ట ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ సమస్యలు వచ్చి మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే అధిక మొత్తంలో దోసకాయలు తినకూడదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?