Health Tips in Telugu : ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఎందుకంటే దీనిలోని ఔషద గుణాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఆరోగ్య సమస్యలకే కాకుండా.. స్త్రీ, పురుషులు లైంగికపరమైన సమస్యలకు ఇది పరిష్కారమిస్తుందంటున్నారు నిపుణులు. అసలు అశ్వగంధ(Ashwagandha Powder Benefits)ను ఎలా తీసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యానికి, స్త్రీ, పురుషుల్లో లైంగిక సమస్యలకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? నిపుణులు ఇచ్చే సలహాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


అశ్వగంధను వేల సంవత్సరాల నుంచి వివిధ ఆరోగ్య ప్రయోజనాలకోసం ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషదగుణాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. నాడీ వ్యవస్థను శాంత పరచడానికి, వృద్ధాప్య ఛాయలను దూరం చేయడానికి దీనిని వినియోగిస్తారు. దీనివల్ల శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు నిపుణులు. 


థైరాయిడ్ దూరం..


పురుషులలో కంటే స్త్రీలలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానిని కంట్రోల్ చేయడంలో అశ్వగంధ సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. థైరాయిడ్ గ్రంధి పనితీరును అశ్వగంధ మెరుగుపరుస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే హైపోథైరాయిడిజం ఉన్నవారు.. రోజూ అశ్వగంధ వైద్యుల సూచనల మేరకు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. 


బరువు తగ్గడంలో


అశ్వగంధలోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. వీటిలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉంటాయని.. ఇవి మెటబాలీజంను పెంచుతాయని ఓ అధ్యయనం నిరూపించింది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను, ట్రైగ్లిజరైడ్​లను తగ్గించి షుగర్​ను అదుపులో ఉంచుతుంది. 


ఒత్తిడిని తగ్గిస్తుంది.. 


చాలా మంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది శారీరక, మానసిక సమస్యలను కూడా ఎక్కువ చేస్తుంది. కాబట్టి దానిని కంట్రోల్ ఉంచడంలో అశ్వగంధ మెరుగైన ప్రయోజనాలు అందిస్తుంది. ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. ఒత్తిడి వల్ల పెరిగే ఫుడ్ క్రేవింగ్స్ కూడా అదుపులో ఉంటాయని తాజా పరిశోధనలూ తెలిపాయి. 


యోని సమస్యలు తగ్గుముఖం..


అశ్వగంధలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెజైనల్​ ఇన్​ఫెక్షన్లను తగ్గించడానికి సహాయం చేస్తాయి. యోని సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు అశ్వగంధను వినియోగిస్తే ఉపశమనం ఉంటుంది. 


పీరియడ్స్, మోనోపాజ్ సమయంలో.. 


స్త్రీలను వెంటాడే సమస్యల్లో మోనోపాజ్ కూడా ఒకటి. ఆ సమయంలో తలెత్తే అన్ని సమస్యలకు అశ్వగంధ ఉపశమనం ఇస్తుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగపడేలా చేస్తుంది. త్వరగా అలసిపోతూ ఉంటే.. అశ్వగంధ టీని తాగితే మంచి ఫలితముంటుంది. ఇది నరాలను ఉత్తేజిత పరుస్తుంది. ఫ్రీరాడికల్స్​నుంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. పీరియడ్స్ సమస్యలను కూడా దూరం చేసి.. రెగ్యూలర్​గా వచ్చేలా చేస్తుంది. ఫెర్టిలిటీ సమస్యలు కూడా తగ్గుతాయి. 



మగవారిలో ఆ సామర్థ్యం పెరుగుతుందట..


మగవారికి కూడా శారీరక, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది అశ్వగంధ. ఆరోగ్య, లైంగిక, సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. వాటిని అశ్వగంధతో అధిగమించవచ్చు. ఒత్తిడి, ఆందోళన, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అశ్వగంధను తీసుకోవడం వల్ల పురుషుల్లో లిబిడో పెరుగుతుంది. ఇది స్టామినాను పెంచుతుంది. స్పెర్మ్ ఉత్పత్తి కూడా మెరుగుపడుతుంది. అశ్వగంధతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. దానిని వినియోగించే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.


Also Read : పిల్లలు పుట్టేందుకు ఏజ్ లిమిట్ ఉందా? ఆ వయసు దాటితే పేరెంట్స్ కాలేరా?