ABP  WhatsApp

Ashok Gehlot Covid Positive: ఆ సీఎంకు మళ్లీ కరోనా పాజిటివ్.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు ప్లీజ్ అంటూ ట్వీట్

ABP Desam Updated at: 06 Jan 2022 08:04 PM (IST)
Edited By: Murali Krishna

రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు మరోసారి కరోనా సోకింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన ట్వీట్ చేశారు.

అశోక్ గహ్లోత్

NEXT PREV

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అయితే తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని గహ్లోత్ తెలిపారు. 70 ఏళ్ల గహ్లోత్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.


తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎం కోరారు. ఇటీవలే గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ కూడా కరోనా బారిన పడ్డారు.











ఈరోజు సాయంత్రం నేను కొవిడ్ పరీక్ష చేయించుకున్నాను. రిపోర్ట్‌లో పాజిటివ్ వచ్చింది. నాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.. ఇంకెలాంటి సమస్య లేదు. నాతో దగ్గరగా ఉన్న వారంతా ఐసోలేషన్‌కు వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒమిక్రాన్‌ను సీరియస్‌గా తీసుకోండి. కొవిడ్ నింబధనలను పాటించండి. వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకోండి. చాలా మంది ఒమిక్రాన్‌ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నారు. దీని వల్ల ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ సమస్యలు ఎలా తీవ్రంగా ఉన్నాయో ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్నాక కూడా సమస్యలు అలానే ఉంటాయి.                                    - అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి


రాజస్థాన్‌లో బుధవారం కొత్తగా 1,883 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. ఒమిక్రాన్ సోకి ఒక వ్యక్తి మరణించాడు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జనవరి 17 వరకు మూసివేస్తూ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. అయితే 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ్యాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది. 


దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌ కూడా ఈ వారం మొదట్లో కరోనా బారిన పడ్డారు. కేజ్రివాల్‌కు కూడా స్వల్ప లక్షణాలు ఉన్నాయి.


Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!


Also Read: PM Security Lapse: మోదీ- రాష్ట్రపతి భేటీ.. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన


Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 06 Jan 2022 08:04 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.