Viral Video Claims 188-Year-Old Man Rescued In Bengaluru Fact Check : సోషల్ మీడియాకు ఎలాంటి క్రాస్ చెకింగ్ వ్యవస్థ లేకపోవడంతో చూసేవారికి ఆసక్తికలిగేలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి వ్యూస్ పెంచుకునేందుకు కొంత మంది ట్రిక్స్ ప్లే చేస్తూంటారు. ఈ క్రమంలో అనేక ఫేక్ న్యూస్ వైరల్ అయిపోతూ ఉన్నాయి. అందులో ఒకటి 188 ఏళ్ల వృద్ధుడిని కర్ణాటకలోని ఓ గుహ నుంచి కాపాడారన్న వార్త. బాగా బక్కచిక్కిపోయిన ఓ వృద్ధుడు పూర్తి స్థాయిలో వంగి నడుస్తూండగా... ఇద్దరు ఆసరాగా పట్టుకున్న ఫోటను చూపించి ఈ ప్రచారం చేస్తున్నారు. కన్సర్నడ్ సిటిజన్ పేరుతో మొదట ఈ ఫోటో, వార్తను పోస్టు చేశారు. గంటల్లోనే ఇది మిలియన్ల మందిని ఆకర్షించింది.
వైరల్ అయిన ఫోటోను విస్తృతంగా షేర్ చేశారు. కానీ ఇందులో నిజమెంత అని నెటిజన్లు చాలా మంది ప్రశ్నించారు. అంతే కాదు కొంత మంది వాస్తవాన్ని కూడా బయట పెట్టారు. నిజమేమిటంటే ఆ వృద్ధుడి వయసు 188 ఏళ్లు కాదు. అసలు కర్ణాటక కూడా కాదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ వృద్ధుడు.. సియారాంబాబాగా ఆ రాష్ట్రంలో బాగానే పేరుతెచ్చుకున్న బాబా. ఆయన వయసు 109 ఏళ్లు. ఆ ఫోటోలో క్లెయిమ్ చేసినట్లుగా 188 ఏళ్లు కాదు. ఫేక్ న్యూస్ గా ఎక్కువగా క్లెయిమ్ రావడంతో ట్విట్టర్ కూడా ఈ పోస్టు కింద అలర్ట్ జారీ చేసింది.
నవభారత్ టైమ్స్ పత్రికలో జూలై 2వ తేదీన సియారాంబాబాకు చెందిన వార్తను ప్రచురిచింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాకు చెందిన వారిగా ఆధారాలతో సలహా వివరించారు.
అలాగే డేటా వెరీఫికేషన్ గ్రూప్ డి ఇంటెంట్ డేటా కూడా ఈ వైరల్ వీడియోను విశ్లేషించింది. మిస్ లీడింగ్ చేసేలా ఉందని తేల్చారు.
సోషల్ మీడియా లో వైరల్ అయ్యే వార్తలకు సంబంధించి నెటిజన్లే ఎక్కువగా అసలు నిజాలన్ని వెలుగులోకి తెచ్చి ఆయా పోస్టుల కిందనే కామెంట్స్ చేస్తున్నారు. సియారాంబాబా విషయంలో అదే జరిగింది. పెద్దఎత్తున ఫేక్ పోస్ట్ అన్న కామెంట్స్ రావడంతో ఎక్స్ కూడా వెంటనే అలర్ట్ జారీ చేసింది.