Fact Check About Talasani Srinivas Yadav  :  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు బీఫాం ఇవ్వడంతో పాటు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు  తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం  నిర్వహించారు.   బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమయ్యారు.  కీలక భేటీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తలసాని కొడుకు తలసాని సాయికిరణ్ యాదవ్ గైర్హాజరు అయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారని.. సికింద్రాబాద్ అభ్యర్థికి బీఫాం అందించారని తెలింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. 


 





  


 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తలసాని పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రతి సమీక్షలో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు.   దీంతో తలసాని వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల గులాబీ పార్టీలో వేళ హాట్ టాపిక్‌గా మారింది.  కానీ ఆయన  పార్టీ సమావేశాలకు  హాజరవుతున్నారని వివిధకారణాలతో ముందే వెళ్తున్నారు కానీ పార్టీకి దూరంగా లేరని అంటున్నారు. తలసాని సాయి కిరణ్  యాదవ్ మాత్రం సమావేశానికి హాజరు కాలేదని  తెలుస్తోంది. 


మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయింది.  


బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా  సీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని  తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా నిర్వహించారు.  ఆ సమయంలో తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోరుకున్నారు. కేసీఆర్ కూడా ఆయనకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనూ తలసాని కుమారుడు  లోక్ సభకు పోటీ చేశారు.  ఓడిపోయారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో లక్ష కుపైగా ఓట్ల మెజార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులకు రావడంతో సులువుగా గెలుస్తారని అనుకున్నారు. 


అయితే అనూహ్యంగా పోటీ చేయడానికి సాయికిరణ్ యాదవ్ వెనుకడుగు వేశారు. తర్వాత కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నే బరిలోకి దిగాలని కోరారు. కానీ తలసాిని మాత్రం అంగీకరించలేదని  బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. చివరికి పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావును ఖరారు చేశారు. ఆయన కోసం మొదట్లో కొన్ని రోజులు పని చేసిన ఆయన ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. కానీ ఆయన  బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని తేలింది.