ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? సొంత పార్టీ ఎందుకు పెట్టారు? రాజకీయ తెర వెనుక ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే... 'యాత్ర 2' చూడాలి. ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. జగన్, భారతి దంపతులుగా జీవా, కేతికా నారాయణ్ నటించారు. మరి, మిగతా పాత్రలు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పాత్ర ఉంటుందా? అంటే... 


'యాత్ర 2'లో తండ్రి కొడుకుల అనుబంధమే
Who Played YS Sharmila In Yatra 2 Movie: 'యాత్ర 2' ట్రైలర్ గమనిస్తే... జగన్, భారతి పాత్రలు కనిపించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్ నటించారు. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు.


తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది 'యాత్ర 2'లో మెయిన్ పాయింట్ అని తెలిసింది. వైఎస్ జగన్ జీవితంలో కొన్ని అంశాలు తీసుకుని సినిమా చేయడంతో కథలో వైఎస్ షర్మిల పాత్రకు ఆస్కారం లేదని తెలిసింది. సో... 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల క్యారెక్టర్ లేదు. ఆ మాటకు వస్తే... 'యాత్ర' సినిమాలోనూ ఆమె రోల్ లేదు. 'యాత్ర 2'లో కూడా లేదు. 


'యాత్ర 2'లో రాజకీయాలకు మించి... 
దర్శకుడు మహి వి. రాఘవ్ (Mahi V Raghav)కు కథ, క్యారెక్టర్స్ విషయంలో పర్టికులర్‌గా ఉంటారు. 'యాత్ర 2'లోనూ కథ డిమాండ్  మేరకు క్యారెక్టర్లు రాశారని తెలిసింది. ఆ క్యారెక్టర్లలో షర్మిల రోల్ లేదు. జగన్ రాజకీయ ప్రయాణం మీద మాత్రమే దర్శకుడు కాన్సంట్రేట్ చేశారట. జగన్ పాదయాత్ర ఆధారంగా 'యాత్ర 2' తెరకెక్కిస్తున్నప్పటికీ... సినిమా కథ 2009 నుంచి 2019 మధ్య జరుగుతుందని, 2012 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినా కమర్షియల్ బయోపిక్ తరహాలో కాకుండా కేవలం తండ్రి కొడుకుల అనుబంధం మాత్రమే చూపించాలని దర్శకుడు అనుకోవడంతో ఆమె పాత్రకు చోటు లేకుండా పోయిందట. 


Also Readసైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?


'యాత్ర' సినిమాను గమనిస్తే... రాజకీయాలను మాత్రమే మహి వి రాఘవ్ తెరపై చూపించలేదు. రాజకీయాలకు మించి... రాజశేఖర్ రెడ్డి జీవితంలో ఏం జరిగింది? అనేది చూపించారు. ఇప్పుడీ 'యాత్ర 2'లో సైతం ప్రజలకు తెలియని అంశాలు చాలా ఉంటాయని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. తండ్రి కుమారుల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ సీరియస్ సినిమా 'యాత్ర 2' అని తెలిసింది. 


త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'యాత్ర' విడుదలైన ఫిబ్రవరి 8న 'యాత్ర 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ యాప్ట్ అని ట్రైలర్ చూసిన తర్వాత జనాలు చెబుతున్నారు. జగన్ పాత్రలో జీవా సైతం ఒదిగిపోయారు. 'యాత్ర 2'లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మరోసారి మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి కనిపించనున్నారు.


Also Read: డ్యాన్సుల్లో శ్రీ లీలకు పోటీ లేదుగా... స్టార్స్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ తెలుగమ్మాయే