టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు సినిమాాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం నటనతో అందర్నీ ఆకట్టుకుందీ భామ. శ్రీలీల అప్పటికే కన్నడ సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం ఈ సినిమానే. పెళ్లి సందడి తర్వాత ఈ ముదుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీలీల త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జతకట్టనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో, చేసింది కొన్ని సినిమాలే అయినా భలే ఛాన్స్ కొట్టేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 


శ్రీలీల ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో నటిస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని పెద్ద ప్రాజెక్టుల్లో శ్రీలీల నటిస్తోందని తెలుస్తోంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమాలో ఈ బ్యూటీ సెకండ్ చాన్స్ కొట్టేసిందని సమాచారం. ఇది కాకుండా డీజె టిల్లు స్క్వేర్ లో కూడా నటిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ముందు అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. అలాగే నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సినిమాలోనూ చాన్స్ కొట్టేసిందట. 


అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జతకట్టబోతోందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వార్త పై మరో అప్డేట్ వచ్చింది. శ్రీలీల, అల్లు అర్జున్ తో కలసి నటిస్తోన్న మాట వాస్తవమే, కానీ అది సినిమాలో కాదట. ఒక యాడ్ ఫిల్మ్ లో అల్లు అర్జున్ తో జతకట్టిందట ఈ భామ. ఆహా ఓటీటీ కోసం త్రివిక్రమ్, అల్లు అర్జున్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో ఒక యాడ్ షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా ఐకాన్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల. ఈ యాడ్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అయితే ఈ న్యూస్ తెలిసిన బన్నీ అభిమానులు నిజంగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది శ్రీలీల. కన్నడలో తెరకెక్కనున్న ఓ పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తోంది. గాలి కిరీటి రెడ్డి హీరోగా లాంచ్ అవుతోన్న మూవీ లో హీరోయిన్ గా కనిపించనుంది ఈ బ్యూటీ. 


Read Also: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?