Nag Ashwin About Kalki 2898 AD: డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో చేరడంతో ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ నెలకొంది. దానికి తోడు ప్రభాస్‌ ‘సలార్‌’ సూపర్ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


మరో మూడు నెలల్లో ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ రిలీజ్  


‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలతో పాటు రిలీజ్ డేట్ గురించి పలు విషయాలు చెప్పారు నాగ్ అశ్విన్. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇందులో వాడిన ఆయుధాలు, వీఎఫ్ఎక్స్‌ షాట్స్‌ కు మంచి స్పందన రావడం సంతోషం కలిగించిందన్నారు. అటు ‘కల్కి’ ట్రైలర్‌ మరో మూడు నెలల తర్వాత విడుదల చేస్తామన్నారు. త్వరలో మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు పెద్ద మొత్తంలో ఉండబోతున్నట్లు వివరించారు. ఈ మూవీలో ఉండే ఫైట్స్ ను అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సినిమా చాలా బాగా నచ్చుతుందన్నారు.   


ఫ్యూచర్ ప్రభాస్ ను చూస్తారు!


ఇక ఈ సినిమాలో ఫ్యూచర్ ప్రభాస్ ను చూస్తారని నాగ్ అశ్విన్ తెలిపారు. కల్కి అనేది చాలా ఎనర్జీతో కూడిన పేరు అని చెప్పిన ఆయన, కథకు సరిపోతుందని ఆ టైటిల్ పెట్టినట్లు వివరించారు. ఈ సినిమా ఎన్ని భాగాలుగా రాబోతుందనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. పురాణాలను సైన్స్ తో కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. పురాణాల్లో ఎన్నో పవర్ ఫుల్ ఆయుధాలు ఉన్నాయని చెప్పిన అశ్విన్, వాటికి టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడవచ్చన్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లాంటి స్టార్ యాక్టర్లతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. లెజెండ్స్‌‌తో సినిమా చేయడం పట్ల గర్వ పడుతున్నట్లు చెప్పారు.


‘కల్కి 2898 ఏడీ’ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, పశుపతి, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. శరవేగంగా కొనసాగుతున్న చిత్రీకరణ త్వరలో కంప్లీట్ కానుంది.  మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.  


Read Also: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?