పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన్ను ఇష్టపడుతుంటారు. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్.. పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. ఆయన మీద ఉన్న అభిమానంతో బురఖా వేసుకొని మరీ 'భీమ్లానాయక్' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు చెప్పింది. ఇక రీసెంట్ గా సాయిపల్లవి.. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.
రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు రానా, సాయిపల్లవి. ఇప్పటికే సాయిపల్లవి ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రీసెంట్ గా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.
ఆయనొక సూపర్ స్టార్ అనే ఫీలింగే చూపించరని.. చాలా సింపుల్ గా ఉంటారని.. మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడతారని.. అందుకే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలానే ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన తను.. తమిళనాడులో పెరిగానని.. మలయాళంలో నటిగా కెరీర్ మొదలుపెట్టానని.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తనను స్టార్ ని చేశారని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాలు, టాలీవుడ్ సూపర్ స్టార్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.
Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?
Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్