Hanuman Role: 'హనుమాన్' సినిమా విడుదలకు ముందు ఓ క్యారెక్టర్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. అంజనీ పుత్రుడు హనుమంతుడిగా ఎవరు నటించారు? అని!ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ కళ్లు చూసి కొందరు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అని ప్రేక్షకులు కొందరు కన్ఫర్మ్ చేశారు. అది నిజమని చాలా మంది నమ్మారు. మెగాస్టార్ హనుమంతుని భక్తులు కావడం, 'హనుమాన్' ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా రావడంతో నమ్మశక్యంగా అనిపించింది. మరి, సినిమాలో హనుమంతుని రోల్ చేసింది ఎవరు? అనేది చూస్తే... 


హనుమాన్ వీఎఫ్ఎక్స్... ఎవరూ నటించలేదు!
'హనుమాన్' సినిమాలో హీరో తేజ సజ్జ పేరు హనుమంతు. అయితే... భగవంతుని పాత్రలో మాత్రం ఎవరు నటించలేదు. సినిమా చివరి వరకు హనుమంతుడు ఎవరు? అని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను ముందుకు నడిపించారు. మధ్య మధ్యలో హనుమంతుని కళ్లు చూపించినా... చివరకు వచ్చేసరికి హనుమంతుని తెరపై తెచ్చారు. అయితే... ఆ భగవంతుడిని వీఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేశారు. హనుమంతుడిని చూపించినప్పుడు 'జై శ్రీరామ్' అంటూ వచ్చిన వాయిస్ చిరంజీవిది అయ్యి ఉంటుందని అభిమానుల ఫీలింగ్. 


'జై హనుమాన్'కు ఎవర్ని తీసుకొస్తారు?
'హనుమాన్' సినిమా వరకు వీఎఫ్ఎక్స్ ద్వారా ప్రశాంత్ వర్మ మేనేజ్ చేశారు. నెక్స్ట్ అలా చేయడం కుదరదు. సినిమా చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' అనౌన్స్ చేశారు. అందులో హనుమంతుడిది ప్రధాన పాత్ర. అప్పుడు వీఎఫ్ఎక్స్ చేయడం కుదరదు. ఎవరో ఒకర్ని తీసుకురావాలి. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.


Also Readగుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?






పెయిడ్ ప్రీమియర్స్ వర్కవుట్ అయ్యాయి!
జనవరి 12న 'హనుమాన్' ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే... ఒక్క రోజు ముందు, జనవరి 11 సాయంత్రం 6 గంటల నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. సినిమా మీద నమ్మకంతో ముందుగా షోలు వేయడం కలిసొచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా సినిమాకు ఒక్క నైజాంలో సుమారు 3 కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చాయని టాక్.


Also Read: ఆ రోజే ప్రభాస్ 'కల్కి' విడుదల - అఫీషియల్‌ గా అనౌన్స్ చేసిన టీమ్



'హనుమాన్'లో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో సిస్టర్ రోల్ చేశారు. తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా విడుదల అయ్యింది. ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ సహా పలు భారతీయ, అంతర్జాతీయ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.