యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బుల్లెట్' అనే సాంగ్ ను విడుదల చేశారు. శింబు పాడిన ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయింది. 


ఇక రీసెంట్ గా విడుదలైన చేసిన టీజర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. త్వరలోనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో 'విజిల్' అనే మరో మాస్ సాంగ్ ని వదిలారు. హీరో సూర్య ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆంథోనీ దాసన్, శ్రీనిష ఈ సాంగ్ ని పాడగా.. సాహితీ లిరిక్స్ అందించారు. ఈ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. 


ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా.. మరొక గెటప్ ను సస్పెన్స్ గా ఉంచారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజయ్యాక బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు రామ్.


Also Read: ఛార్మితో రిలేషన్, భార్యకు పూరి విడాకులు - ఆకాష్ పూరి ఏమన్నారంటే?


Also Read: పరశురామ్ ని హోల్డ్ లో పెట్టిన చైతు - మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో!