హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజుపై చాలా కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో ఆయన్నీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదేంటీ? దిల్ రాజును రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఎందుకు అని అనుకుంటున్నారా? ప్రముఖ దర్శకుడు శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 చిత్రానికి దిల్ రాజు, శిరీష్‌లే నిర్మాతలు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ కూడా. సినిమా రిలీజ్ అయినా కాకపోయినా పర్వాలేదు. కానీ, ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకపోతేనే సమస్య. ప్రస్తుతం అదే జరుగుతోంది.
RC15 గురించి ఒక్క ఫొటో మినహా ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రావడం లేదు. మరోవైపు దిల్ రాజు.. తమిళం విజయ్‌తో ‘వారసుడు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో అభిమానులు ఎలా ఫీలవ్వుతారో మీకు తెలిసిందే. అసలు రామ్ చరణ్ సినిమా తెరకెక్కుతోందా? ప్రకటన ఇచ్చి వదిలేశారా అనే సందేహం కూడా అభిమానుల్లో ఉంది. అందుకే, ఆ సినిమా గురించి ఏదో ఒక సమాచారం చెప్పాలంటూ.. అభిమానులు WAKE UP DILRAJU, #WakeUpDilRaju హ్యాష్ ట్యాగ్‌లతో దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 37 వేల వరకు పోస్టులు ట్విట్టర్‌లో ట్రెండవ్వుతున్నాయి. ‘దిల్ రాజు మేలుకో ఆర్సీ15 అప్‌డేట్స్ ఇవ్వు’ అనే కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోగా రామ్ చరణ్ 15వ సినిమా ఇది (RC15). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. ప్రభుత్వ వ్యవస్థ, ఉద్యోగుల నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌తో ఫస్ట్ లుక్ అప్‌డేట్ ఉంటుందని తెలిసింది. కానీ, రోజులు గడుస్తున్నాయేగానీ, అప్‌డేట్స్ లేవు. దిల్ రాజు గతంలో చెప్పిన వివరాల ప్రకారం.. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని అప్‌డేట్స్‌తో సిద్ధమైపోవాలి. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలి. కానీ, ఆ హడావిడి ఏదీ కనిపించకపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. మరీ అభిమానుల కోరిక మేరకు దిల్ రాజు ఏమైనా అప్‌డేట్ ఇస్తారో లేదో చూడాలి.
Also Read : మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Also Read : లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?