ఏంది బిడ్డ ఇలా చేస్తున్నావ్ నువ్వు ఇంట్లో కనిపించక ఎంత అల్లాడిపోయానో తెలుసా అని రుక్మిణి ఏడుస్తుంది. అలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా అని ఆదిత్య అంటే ఏం చేయను సారు నాయన ఎక్కడ ఉన్నదంటే అమ్మ చెప్పడం లేదు నిన్ను తెలుసుకోమని అడిగితే నువ్వు చప్పుడు చెయ్యకుండా ఉన్నావ్ అందుకే నేనే నాయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని వచ్చా కానీ ఎవరు తెలియదని అంటున్నారు, నేను మా నాయన్ని చూడాలి సారు చాలా మాట్లాడాలి అందరి నాయనలాగా మా నాయన ఎందుకు ఉండదని అడగాలి. బిడ్డని చూడకుండా ఇన్ని దినాలు ఏ నాయన అయినా ఉంటాడా? అని దేవి ఏడుస్తూ అడుగుతుంటే ఆ మాటలకి రుక్మిణి అల్లాడిపోతుంది. నీకు మీ నాన్న కావాలి మీ నాన్నని చూడాలి అంతే కదా నాకు నాలుగు రోజులు టైం ఇవ్వు మీ నాన్నని తీసుకొస్తాను అని ఆదిత్య మాట ఇస్తాడు. ఆపతి వరకి ఇలాంటి పనులు చేసి అమ్మని బాధపెట్టకు అని అంటాడు. నువ్వు నాయన్ని తీసుకొస్తానని మాట ఇచ్చావ్ గా ఇంక చెయ్యనులే అంటుంది దేవి.


Also Read: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం


మాధవ ఇంట్లో అందరూ దేవి కోసం కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డ ఎటు పోయిందో ఏంటో అని జానకి ఏడుస్తుంది. ఇంకోకసారి వెళ్ళి చూసి రండి అని జానకి చెప్పడంతో మాధవ రామూర్తి బయల్దేరతారు. అప్పుడే ఆదిత్య, రుక్మిణి దేవిని తీసుకుని ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి అందరూ సంతోషంగా చూస్తారు. దేవి వచ్చావా అని జానకి తనని దగ్గరకి తీసుకుని ప్రేమగా ముద్దు పెడుతుంది. మాధవ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్లిపోయావ్ నీకోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా అని జానకి అడుగుతుంది. తన మనసులో చాలా బాధ ఉంది అది నాతో చెప్పుకుంది దాన్ని త్వరలోనే నేను తీరుస్తాను అని ఆదిత్య అంటాడు. మా రాధతో పాటు నువ్వు వచ్చావంటే పొద్దుటి నుంచి వెతుకుతున్నావని అర్థం అయ్యింది. మా బిడ్డని మీ బిడ్డలా ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉందని రామూర్తి అనడంతో దేవి నా బిడ్డే అని ఆదిత్య అంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. అవునండీ మాకు పిల్లలు లేరని బాధపడుతున్న మా కుటుంబం అంతా దేవిని మా బిడ్డే అని అనుకుంటున్నామని చెప్తాడు. ఏరా తల్లి నాన్నకి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్ తల్లి అని మాధవ నటిస్తూ కని నిండా నీళ్ళతో అడుగుతాడు. నువ్వు కనిపించక ఈ నాన్న ఎంత అల్లడిపోయాడో అని మాధవ అంటుంటే.. రాధ తన సమస్య ఏంటో నాకు చెప్పింది తీరుస్తానని నేను మాట ఇచ్చాను ఇక తనని ఎవరు మాట్లాడించి బాధపెట్టాల్సిన అవసరం లేదు తీసుకెళ్ళి ముందు తనకి ఏదైనా తినిపించు అని ఆదిత్య కోపంగా చెప్తాడు. అందరూ వెళ్లిపోవడంతో మాధవ అసలు స్వరూపాన్ని బయటపెడతాడు.


మాధవ; ఏంటి నా ఇంటికి వచ్చి నీ ఇంటి మనిషి మీద పెత్తనం చేసినట్టు పెత్తనం చేస్తున్నావ్


ఆదిత్య: ఏ ఇంట్లో ఉన్నా తను నా మనిషి, అది తెలిసి నువ్వు ఈ ప్రశ్న అడగటం తప్పు. అయినా నువ్వేంటి నా కూతురు దగ్గర తెగ నటిస్తున్నావ్. దేవి ఇంట్లో నుంచి వెళ్ళడానికి నువ్వు కారణం కాదా.. ఆ పసిమనసులో నాన్న గురించి ద్వేషం పెంచి ఈరోజు ఇల్లు వదిలిపోయాలా చేశావ్, తను క్షేమంగా కనిపించింది కాబట్టి నువ్వు ఈరోజు ప్రాణాలతో మిగిలిపోయావ్, అదే దేవికి ఏ చిన్న ప్రమాదం జరిగినా నిన్ను ప్రాణాలతో వదిలే వాడిని కాదు. ఇప్పుడు కాదు ఇంకోసారి ఇలా జరిగిందంటే మాత్రం నిన్ను క్షమించను, నీ కూతురు కోసం నా కూతుర్ని బాధపెడ్తున్నావ్ అది మంచిది కాదు గుర్తుంచుకో


మాధవ: ఆఫీసర్ నీ కూతురు, నీ భార్య అని నీకు నాకు మాత్రమే తెలుసు కానీ వాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారు అయినా నా ఇంటికే వచ్చి నాకే ధమ్ కీ ఇస్తున్నవంటే నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు పాపం కూతుర్ని అటు ఇటు వెతికి అలిసిపోయినట్టు ఉన్నవ వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో


ఆదిత్య: ఇక్కడ ఉన్నారు కదా అని ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.


Also Read: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు


నా కూతురు కోసం నీ కూతుర్ని బాధపెడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావ్ అసలు విషయం తెలిస్తే నీ గుండె మండిపోతుంది ఆగిపోతుంది. రాధ దేవి ఈ ఇంటి నుంచి తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటున్నావ్ వాళ్ళిద్దరూ ఈ ఇంటి నుంచి బయటకి వెళ్ళిన మరుక్షణం ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని మాధవ అనుకుంటాడు.


రాధ దేవికి అన్నం తినిపించేందుకు వస్తుంది. కానీ దేవి వద్దు అని అన్నం ప్లేట్ విసిరేస్తుంది. తినే అన్నం ప్లేట్ విసిరేస్తే అన్నం దొరకదని రుక్మిణి కోపంగా అంటుంది. నాయన ఎక్కడా అని అడిగితే చెప్పావ్ కానీ ఇటువంటివి మాత్రం బాగా చెప్తావ్ అని దేవి కోపంగా అంటుంది. అప్పుడే భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. నువ్వు అంటే మీ అమ్మకి ప్రాణం అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావెంటీ అని అనుకుంటుంది. మా నాయన చూడాలి మాట్లాడాలి అప్పటి వరకు ఇలాగే ఉంటాను, ఇసువంటి పనులే చేస్తాను ఎవరు ఏమనుకున్న నేను ఇంతే అనడంతో రుక్మిణి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా బిడ్డని అట్లా బాధపెడుతున్నారని భాగ్యమ్మ దేవిని అంటుంది.