బొల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh)... మొదటి సినిమా 'స్వాతిముత్యం'తో ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఇన్నోసెంట్ అబ్బాయి తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ హీరో నుంచి వస్తోన్న తర్వాత సినిమా 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir Movie). తాజాగా సినిమా టీజర్ (Nenu Student Sir Teaser) ను దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 


నా ఐ ఫోన్ పోయింది సర్!


'నేను స్టూడెంట్ సర్' టీజర్ లో బెల్లంకొండ గణేష్ కూల్ యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. హీరో కష్టపడి ఐ ఫోన్‌ కొనుక్కుంటాడు. అయితే ఆ ఫోన్ ను ఎవరో కొట్టేస్తారు. పోలీసులే కొట్టేశారు అని అనుమానం వచ్చి కమిషనర్‌ కు కంప్లైంట్‌ ఇవ్వడానికి వెళ్తాడు హీరో. అప్పుడు ఎవరో కావాలని ట్రాప్‌ చేసినట్లు హీరోకు సునీల్ చెప్తాడు. సునీల్ చెప్పినట్టుగానే పోలీస్ లు హీరోను టార్గెట్ చేస్తారు. తర్వాత ఏమైంది ? అసలు ఆ ఫోనులో ఏముంది? ఎందుకు ఫోన్ కొట్టేశారు? తర్వాత హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? అనే అంశాల మీద సినిమా ఆధారపడినట్టు కనిపిస్తోంది. సినిమా టీజర్ చూస్తే ఐఫోన్ చుట్టూ తిరిగే ఓ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది.


స్టైలిష్ లుక్ లో బెల్లంకొండ గణేష్ :


బెల్లంకొండ గణేష్ ఈ సినిమాలో డీడెంట్ లుక్ తో పాటు స్టైలిష్ గానూ కనిపిస్తున్నాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐ ఫోన్, కాలేజి స్టూడెంట్, మర్డర్, పోలీసులు చుట్టూ తిరిగే కథలా అనిపిస్తుంది. అలాగే సినిమాలో యాక్షన్ పోలీస్ గా వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని పాత్ర కూడా కొంచెం వైలెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. మహతి సాగర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా బెల్లంకొండ గణేష్ కు మంచి సక్సెస్ అందుకునేలా చేస్తుందేమో చూడాలి. 


Also Read : థ్రిల్, రొమాన్స్, హారర్ - 'మసూద' ట్రైలర్ చూశావా కృష్ణా?


టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమాను 'నాంది' సినిమా మేకర్స్ నిర్మించారు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆ సినిమా మేకర్స్ ఈ సినిమా తీయడంతో 'నేను స్టూడెంట్ సర్'పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు దర్శకుడు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా సతీశ్ వర్మ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' హీరోయిన్ గా పరిచయం అవుతోంది.  త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.