టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల్లో నటించిన ఈ హీరో ప్రస్తుతం 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారు విశ్వక్ సేన్. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు విశ్వక్ సేన్. 'ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి' అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టడంలో సాయంచేయమంటూ ప్రేక్షకులను కోరారు.
#HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో మీ సూచనలు తెలియజేయమని అడిగారు. ఈ రెండు రోజుల డెడ్ లైన్ ఏంటో మాత్రం క్లారిటీ లేదు. బహుశా టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తారేమోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన కుమారుడు సుధీర్ ఈదర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: లిప్ లాక్ సీన్స్ పై ట్రోలింగ్.. స్పందించిన అనుపమ..
Also Read: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?
Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?
Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..
Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి