తమిళ నటుల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లలో హీరో విశాల్ ఒకరు. ఆయన పెళ్లిపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, విశాల్ మాత్రం ఆ మాటను దాట వేస్తున్నాడు. దీంతో విశాల్ పెళ్లి అప్డేట్ పై ఇటు అభిమానులు, సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్న ప్రతీసారి ఆయన పెళ్లికి ఏదో ఒక అడ్డంకి వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా విశాల్‌ను పెళ్లి గురించి అడిగితే.. దిమ్మతిరిగే అన్సర్ చెప్పాడు. అది విని అందరూ షాక్ అయ్యారు. హీరో ప్రభాస్ పెళ్లి చేసుకున్న రోజున తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు విశాల్. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంతే కాదు పెళ్లి అనేది తన మైండ్ లో ఎక్కడో ఉందని, పెళ్లి అనేది పెద్ద బాధ్యత, పెళ్లిపై తనకు ఇంకా ఫోకస్ రాలేదని చెప్పుకొచ్చారు విశాల్.
ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విశాల్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో హీరో ఆర్య పెళ్లి చేసుకున్న తర్వాతే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని అన్నారని, అయితే ఆర్యకు ఇప్పుడు పెళ్లై, పిల్లలు కూడా పుట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విశాల్ కు ఈపాటికి పెళ్లైపోవాలి. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. గతంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తో విశాల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తమిళ మీడియా వార్తలు వండి వార్చింది. తర్వాత అవన్నీ ఒట్టి పుకార్లు అని తెలిసింది.
కొన్ని నెలల క్రితం విశాల్ కు హైదరాబాద్ కు చెందిన అనూష అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. దాదాపు పెళ్లి తేదీ కూడా ఖారాారు అయింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన అభినయ అనే నటితో విశాల్ డేటింగ్ లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కూడా విశాల్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారంతా..
విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈవెంట్ లో విశాల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను తమిళ సినీ ఆర్టిస్టుల కోసం ఓ భవనాన్ని నిర్మిస్తున్నానని, అది పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన పెళ్లి పై వస్తోన్న వార్తలకు ఫులిస్టాప్ పడుతుందేమో అనుకున్నారు. కానీ అది జరగలేదు. విశాల్ ఎక్కడికి వెళ్లినా ఈ పెళ్లి ప్రస్తావన రావడంతో తాజాగా హీరో ప్రభాస్ పెళ్లితో లింక్ పెట్టారు విశాల్. ఇదే ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ పెళ్లి అప్డేట్ వస్తేనే విశాల్ పెళ్లిపై క్లారిటి వస్తుందన్నమాట.. అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.
Also Read: ఉర్ఫీ జావేద్ ఎవరు? ఎందుకు సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది?