కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పెళ్లిపై గత కొద్ది నెలలుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన త్వరలో యువనటి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విశాల్ తో కలిసి పలు సినిమాల్లో నటించిన లక్ష్మీ మీనన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు పలు పత్రికలు, వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నా, అటు విశాల్ గానీ, ఇటు లక్ష్మీ మీనన్ గానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి వార్తలు మరింత ఊపందుకున్నాయి. చివరకు విశాల్ ఈ వార్తలకు పుల్ స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ వార్తలను ఆయన ఖండించారు.


అమ్మాయి జీవితాన్ని ఇబ్బందుల పాలు చేయకండి- విశాల్


గత కొద్ది రోజులుగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు విశాల్. “వాస్తవానికి నా గురించి వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్ గురించి అస్సలు స్పందించను. వాటి గురించి మాట్లాడ్డం  అనవసరం అని భావిస్తాను. అందుకే లైట్ తీసుకుంటాను. కానీ, ఇప్పుడు వచ్చిన వార్తలపై కచ్చితంగా క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.  లక్ష్మీ మీనన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాను. లక్ష్మీ మీనన్ హీరోయిన్  కంటే ముందు ఒక అమ్మాయి అని గుర్తుంచుకోండి. ఆమె వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగేలా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను. నా పెళ్లి అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. ఇకనైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.   






తమిళ సినిమా పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆయన టాప్ హీరోగా ఎదిగారు. ‘పందెం కోడి’,  ‘అభిమన్యుడు’, ‘భరణి’, ‘ఇంద్రుడు’, ‘పొగరు’, ‘డిటెక్ట‌వ్’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. విశాల్ కు తమిళ్ తో పాటు తెలుగులోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించాయి.  విశాల్‌, లక్ష్మీ మీనన్ కలిసి ‘పల్నాడు’, ‘ఇంద్రుడు’ సినిమల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.


త్వరలో ‘మార్క్ ఆంటోనీ’  విడుదల


ఇక విశాల్ ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. టైం ట్రావెల్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


Read Also: ‘ఇండియా డే’ పరేడ్‌కు రండి! అందాల తార సమంతకు అరుదైన గౌరవం


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial