కొంత కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన అందాల తార సమంత, ప్రస్తుతం వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తన ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాకు వెళ్లిన సమంత, ప్రస్తుతం బాలిలో ప్రకృతి అందాలను తిలకిస్తోంది. అక్కడి అద్భుత దృశ్యాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్ లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే పరేడ్‌ లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులుగా ఆమెకు ఆహ్వానం పంపించారు. సమంతతో పాటు మరికొంత మంది నటీనటులకు ఇన్వెటేషన్ లభించింది. వీరిలో  నటుడు రవికిషన్‌, నటి జాక్వైలిన్‌ ఫెర్నాండేజ్‌ ఉన్నారు. ఇప్పటికే ఈ వేడుకలో పలువురు  భారతీయ నటీనటులు పాల్గొన్నారు.  అభిషేక్‌ బచ్చన్, రానా, అల్లు అర్జున్‌, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్‌, తమన్నా హాజరయ్యారు. ప్రవాస భారతీయులతో కలిసి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు.

    


ఆరోగ్య సమస్యలతో సినిమాలకు బ్రేక్


కొద్ది రోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు సమంతా ప్రకటించింది. సుమారు ఏడాది పాటు సినిమాలు చేయట్లేదని వెల్లడించింది. కొద్ది సంవత్సరాలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స తీసుకుంటూనే సినిమాలు చేసింది. అయితే, ‘శాకుంతలం’ మూవీ డిజాస్టర్ తర్వాత కొద్ది కాలం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు పూర్తి స్థాయిలో నయం అయ్యేందుకు అమెరికాలో చికిత్స తీసుకోనున్నట్లు ప్రకటించింది. సైన్ చేసిన సినిమాలను దాదాపు పూర్తి చేసింది. కొన్ని సినిమాలకు ఓకే చెప్పినా, షూటింగ్ మొదలుకాని వాటి నుంచి తప్పుకుంది. ఈ మేరకు తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేసింది. ప్రస్తుతం మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు బాలిలో వెకేషన్ గడుపుతోంది.


సెప్టెంబర్ 1న ‘ఖుషి’ మూవీ విడుదల


ఇక సామ్‌ సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన ‘ఖుషి’ ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతోంది.  విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలు సినిమాపై భారీ అంచనా నెలకొంది. సెప్టెంబర్‌ 1న గ్రాండ్‌ గా ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. దీనితో పాటుగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ సైతం స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది. రాజ్‌ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత పోలీసు పాత్రలో కనిపించబోతోంది.   






Read Also: ‘ఖుషీ’ ఆ హిట్ మూవీకి కాపీ? - వాటిని మార్చలేమన్న దర్శకుడు శివ నిర్వాణ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial