రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘ఖుషి’ ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే, ఈ ట్రైలర్ అచ్చం మాధవన్ నటించిన ‘అలైపాయుతే‘  మాదిరిగానే ఉందనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.


ప్రేమ, పెళ్లి ఎక్కడైనా ఒక్కటే- శివ నిర్వాణ


“‘ఖుషి‘ ట్రైలర్, మాధవన్ హిట్ మూవీ 'అలైపాయుతే' ఉందని చాలా మంది అంటున్నారు. అయితే, ప్రేమ, పెళ్లి అనే విషయాలు చాలా సినిమాల్లో కామన్ గా ఉంటాయి. బోరింగ్ డైలాగ్స్,  డ్రామా లేకుండా ప్రేక్షకులను సినిమాలో లీనం అయ్యేలా చేయడం అనేది చాలా ముఖ్యం.  పెళ్లి కాని, పెళ్లయిన ప్రేక్షకులు తమ జీవితాన్ని ఈ సినిమాలో చూసుకునే అవకాశం ఉంటుంది. వారిని సినిమా తప్పకుండా కనెక్ట్ చేస్తుంది” అన్నారు.


‘ఖుషి’కి 'అలైపాయుతే'కి పోలిక ఏంటి?


రీసెంట్ గా చిత్రబృందం ‘ఖుషి‘ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు, సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. అయితే, ఈ ట్రైలర్  మణిరత్నం క్లాసిక్ 'అలైపాయుతే' మూవీకి దగ్గరి పోలికలను కలిగి ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడి వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నారు. "నాకు అనిపించేది ఏమిటంటే, ‘అలైపాయుతే’ అయినా,  ‘మౌన రాగం’ అయినా, ఇంకే సినిమా అయినా, ప్రేమ, వివాహం అనేవి ఒకేలా ఉంటాయి. వాటిని మనం మార్చలేం. ప్రేమకథలో ఏది చెప్పాలనుకున్నా, ప్రేమ ఉండాలి. పెళ్లి కథలో పెళ్లి ఉండాలి" అన్నారు.


ఇక ‘ఖుషి’ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. పాటలు అందరినీ అద్భుతంగా అలరించాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అందరినీ అలరించింది.  'మహానటి' తర్వాత సమంత -విజయ్ దేవరకొండ కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేశారు.  పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా విజయ్ దేరవకొండ, సమంత, శివ నిర్వాణలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.






Read Also: బాబోయ్ ఏంటీ అరాచకం? షర్ట్ విప్పేస్తూ హీరోయిన్ రచ్చ - బోల్డ్ పోస్టర్ వైరల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial