Vijay Devarakonda Reacts To Engagement Rumours With Rashmika: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వీరిద్దరు కలిసి చేసింది రెండు సినిమాలే అయినా, వెండితెరపై హాట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, వీళ్లు రియల్ లైఫ్ కపుల్ మాదిరిగానే ఉన్నారంటూ ప్రేక్షకులు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఈ కాంప్లిమెంట్స్ కు నిజమే అనేలా ఇద్దరు కలిసి తరుచుగా హాలీడే ట్రిప్స్ కు వెళ్తూ కనిపించారు. పండుగలు, ఇతర ముఖ్యమైన వేడుకలకు రష్మిక, విజయ్ ఇంటికి కూడా వెళ్తోందనే వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
త్వరలో ఎంగేజ్‌మెంట్ అంటూ వార్తలు
వాస్తవానికి రష్మిక, విజయ్ రిలేషన్ షిప్ లో ఉన్నారా? లేదా? అనే విషయం తెలియకపోయినా, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వీరు పెట్టే ఫోటోలు ఒకే దగ్గర తీసినవి అంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు తేల్చి చెప్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్యన కచ్చితంగా ప్రేమ ఉందంటున్నారు. మరికొంత మంది ఏకంగా వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ వార్తలు రాసేశాయి. ఫిబ్రవరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.
ఎంగేజ్‌మెంట్ వార్తలపై స్పందించిన విజయ్ దేవరకొండ
తాజాగా తన ఎంగేజ్‌మెంట్ గురించి వస్తున్న వార్తలపై విజయ్ దేవరకొండ స్పందించాడు. నిశ్చితార్థం, పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పాడు. ‘‘ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం జరగడం లేదు, పెళ్లి కూడా జరగడం లేదు. ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని పత్రికలు భావిస్తున్నట్లు అనిపిస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఈ ఊహాగానాలను వింటూనే ఉన్నాను. మీడియా నన్ను పట్టుకుని ఎప్పుడు పెళ్లి చేద్దామా? అని ఎదురు చూస్తోంది” అని విజయ్ చెప్పాడు. రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ వార్తల గురించి వారి సన్నిహితులు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వాళ్లు తమ కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. నిశ్చితార్థం, పెళ్లి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రస్తుతం వాళ్లు రిలేషన్ షిప్ లో హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు.
వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
ఇక రీసెంట్ గా రష్మిక, విజయ్ పెళ్లి గురించి ఆస్ట్రాలజర్ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు పెళ్లితో ఒక్కటవుతారని చెప్పారు. కానీ, వివాహం తర్వాత వీళ్లు విడిపోతారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే రష్మికకు చెప్పినట్లు వెల్లడించారు. విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని సూచించినట్లు వివరించారు. కానీ, తన మాటలు రష్మికకు అస్సలు నచ్చలేదన్నారు. ఈ విషయం చెప్పిన తర్వాత మాట్లాడ్డం మానేసిందన్నారు. రష్మిక, విజయ్ కలిసి ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’(2019) అనే సినిమాల్లో నటించారు. రష్మిక ఇటీవల ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు చేస్తోంది. విజయ్ దేవరకొండ పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు.
Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘నా సామిరంగ’ దూకుడు, 6 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే?