దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ఫైనల్ గా జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 


దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'నగాదారిలో', 'చలో చలో' అనే సాంగ్స్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. సాయిపల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు భారీ ఈవెంట్స్ ను నిర్వహించింది చిత్రబృందం. ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. 


హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ వారంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీనికి గెస్ట్ లుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ రాబోతున్నారట. రానా, చరణ్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. తన స్నేహితుడి సినిమా ప్రమోట్ చేయడానికి వస్తున్నారు చరణ్. ఇక వెంకీ.. రానాకి బాబాయ్. తమ ప్రొడక్షన్ లో వస్తోన్న సినిమా కాబట్టి ఆయన కూడా ప్రమోషన్స్ లో భాగం కానున్నారు. 


ఈ మధ్యకాలంలో రానాకి సరైన హిట్టు పడలేదు. 'విరాటపర్వం'తో సక్సెస్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.  నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.


Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!


Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్