Saindhav to stream on prime video from February 3rd: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సైంధవ్'. ఇది ఆయనకు చాలా స్పెషల్. ఎందుకు అంటే... ఆయన ప్రయాణంలో ఇదొక మైలురాయి. హీరోగా 75వ సినిమా. అందుకని, వెంకటేష్ ప్రచారంలో జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. అయితే... వెంకీ & సినిమా యూనిట్ సభ్యులు ఆశించిన ఫలితం రాలేదు. కానీ, వెంకటేష్ నటనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్లకు ఓ గుడ్ న్యూస్. అతి త్వరలో, ఈ వారం ఓటీటీలో 'సైంధవ్' స్ట్రీమింగ్ కానుంది.


ఫిబ్రవరి 3 నుంచి ప్రైమ్ వీడియోలో 'సైంధవ్'
Saindhav OTT Release Date: తెలుగుతో పాటు తమిళ భాషలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 'సైంధవ్' స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. తొలుత నాలుగు వారాలకు విడుదల చేయాలని ప్లాన్ చేశారట. అయితే... థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోవడంతో అనుకున్న తేదీ కంటే ముందుగా ఓటీటీలోకి వస్తుంది.


Also Readత్వరలో సర్జరీకి రెడీ అవుతున్న 'బిగ్ బాస్' అభిజీత్‌... ఆయనకు ఏమైందంటే?






సైకో అలియాస్ సైంధవ్ కథ ఏమిటంటే?
'సైంధవ్'లో సైకో అలియాస్ సైంధవ్ పాత్రలో వెంకటేష్ నటించారు. చంద్రప్రస్థ పోర్టులో ఉద్యోగి. ఆయనకు ఓ పాప. చిన్నారి పేరు గాయత్రి (సారా పాలేకర్). భర్త కొట్టటానికి ఇంటికి వచ్చేసి, అతడి నుంచి విడాకులకు అప్లై చేసిన మనో అలియాస్ మనోజ్ఞ (శ్రద్ధా శ్రీనాథ్) పక్కింటిలో ఉంటుంది. పాపను కన్న కుమార్తెలా చూసుకుంటుంది. సైంధవ్ ప్రవర్తన చూసి ఇష్టపడుతుంది.


Also Read: ధనుష్, నాగార్జున సినిమా టైటిల్ ఫిక్స్ - అందులో కింగ్ రోల్ ఏమిటంటే?


గాయత్రి ఒక రోజు స్పృహ తప్పి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకు వెళితే... రూ. 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని చెబుతారు. అంత డబ్బు కోసం సైంధవ్ ఏం చేశాడు? అతని గతం ఏమిటి? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) పాత్ర ఏమిటి? చంద్రప్రస్థ అడవుల్లోకి చిన్నారులను తీసుకెళ్లి వాళ్లు చేస్తున్న అరాచకం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.     


'సైంధవ్'లో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా!
'సైంధవ్'లో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించగా... సినిమాలో మరో ఇద్దరు అందాల భామలు కూడా ఉన్నారు. డాక్టర్ రేణు పాత్రలో 'చిలసౌ', 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ కనిపించారు. నవాజుద్దీన్ మనసు పడిన అమ్మాయిగా, మాఫియాలో అతడిని తోడు నీడగా ఉండే మహిళగా ఆండ్రియా జెరెమియా కనిపించారు. తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన ఆర్య మానస్ పాత్రలో నటించారు. ఇంకా జిష్షు సేన్ గుప్తా, ముఖేష్ ఋషి, గెటప్ శ్రీను, జయప్రకాశ్ తదితరులు సినిమాలో నటించారు.