సంక్రాంతికి తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆ జోష్ కంటిన్యూ చేస్తూ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. అది ఏమిటో తెలుసా? 


ధనుష్... నాగార్జున... ముంబైలో 'ధారవి'!
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాకు 'ధారవి' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ముంబైలో మురికివాడ ధారవి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకని, ఆ టైటిల్ అయితే యాప్ట్ అని హీరోలతో పాటు దర్శక నిర్మాతలు భావించారట. కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... ధారవిలో ఇళ్లను హైలైట్ చేశారు. ఇప్పుడు ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. 


Nagarjuna role in Sekhar Kammula movie: ఈ సినిమాలో మాఫియా డాన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారట. ధారవి ప్రాంతానికి చెందిన యువకుడిగా ధనుష్ రోల్ డిజైన్ చేసినట్లు టాక్. మరి, రష్మిక రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో నేషనల్ క్రష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల యాక్షన్ జానర్ టచ్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీస్ తీసిన ఆయన ఫస్ట్ టైం యాక్షన్ సినిమా తీస్తుండటంతో జనాల్లో ఆసక్తి పెరిగింది. 


Also Read: త్వరలో సర్జరీకి రెడీ అవుతున్న 'బిగ్ బాస్' అభిజీత్‌... ఆయనకు ఏమైందంటే?


నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు 'ధారవి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 17న పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఆ రోజే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. హీరో ధనుష్ మీద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.


Also Readటాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!






రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత...
'ఫిదా', 'లవ్ స్టోరీ'... రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంక్రాంతి హిట్ 'నా సామి రంగ' తర్వాత నాగార్జున నటిస్తున్న చిత్రమిది. ధనుష్ కూడా సంక్రాంతికి తమిళంలో భారీ వసూళ్లు సాధించిన సినిమా చేశారు. తెలుగులో ఆలస్యంగా విడుదలైన, అంత ఆడని 'కెప్టెన్ మిల్లర్' తమిళంలో హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. రామకృష్ణ & మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లు.