బ్లాక్ బస్టర్ ‘వేద’ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల


కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన తాజా సినిమా ‘వేద’ తెలుగులో విడుదకాబోతోంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ  క్రియేషన్స్ ద్వారా  తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన టైటిల్,  ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం.


హీరో శివ రాజ్‌కుమార్‌ 125వ చిత్రంగా తెరకెక్కిన ‘వేద’






ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో గతేడాది డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.   ఐకానిక్ హీరో శివ రాజ్‌కుమార్‌  నటించిన 125వ చిత్రంగా తెరకెక్కింది. శివరాజ్ కుమార్ భార్య గీత నేతృత్వంలో గీతా పిక్చర్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందింది.  ఇప్పుడీ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.   1960 నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా కన్నడలో బ్లాక్ బస్టర్ సాధించినట్లుగానే, తెలుగులోనూ చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.


స్వామి జె గౌడ్ సినిమాటోగ్రఫీ, అర్జున్‌ జన్య సంగీతం  


ఈ సినిమాకు సంబంధించిన సాంకేతి బృందం విషయానికి వస్తే, స్వామి జె గౌడ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎడిటర్ గా దీపు ఎస్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంగీతం  అర్జున్‌ జన్య అందిస్తున్నారు. పిఆర్ఓ గా విఆర్ మధు ఉన్నారు. ప్రసాద్ లింగం డిజిటల్ మీడియా చూస్తున్నారు.


పునీత్ రాజ్ కుమార్ సోదరుడే హీరో శివ రాజ్ కుమార్‌


కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు హీరో శివ రాజ్ కుమార్‌. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుల్లో ఒక‌రైన పునీత్ రాజ్ కుమార్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 29న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. జిమ్ చేస్తున్న స‌మ‌యంలో పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె పోటు వ‌చ్చింది. ఆయ‌న్ని వెంట‌నే బెంగుళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయారు. క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ఆయనను ప‌వ‌ర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్‌కుమార్‌. పునీత్ చనిపోయినప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, రామ్ చ‌ర‌ణ్‌ సహా పలువురు నటులు బెంగుళూరుకి వెళ్లి ఆయ‌న కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించారు.






 Read Also: మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టబోతున్న మురుగదాస్, శివ కార్తికేయన్‌ హీరోగా సినిమా!