మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇటీవల 'ది ఘోస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రవీణ్ సత్తారు ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ షురూ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో వరుణ్ తేజ్ గన్స్ లోడ్ చేస్తూ.. షాట్ కోసం రెడీ అవుతూ కనిపించారు. వీడియోలో చివరగా బులెట్ పై 'ది గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ బిగిన్స్' అని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
స్పై థ్రిల్లర్ కాదు:
ఈ సినిమా షూటింగ్ మొత్తమంతా యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) లో ఉంటుంది. యాక్షన్ అంతా కూడా అక్కడే అని తెలిపారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. స్పై థ్రిల్లర్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వరుణ్ తేజ్ సినిమాలో మెసేజ్ ఉంటుందని ప్రవీణ్ సత్తారు చెప్పారు. యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ... అందులో మంచి మెసేజ్ ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు గట్టిగా తగిలే సందేశంతో సినిమా తీస్తున్నామని ఆయన బలంగా చెప్పారు.
'గరుడవేగ' సినిమాతో స్టైలిష్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. నాగార్జున 'ది ఘోస్ట్' కూడా యాక్షన్ సినిమాయే. వరుణ్ తేజ్ సినిమా కూడా యాక్షన్ జానర్ ఫిల్మ్. ఇప్పటి వరకు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవల్ అన్నట్టు వరుణ్ తేజ్ సినిమా సినిమా ఉంటుందట. అక్టోబర్ 10న స్టార్ట్ అయిన ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చేస్తారట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, ఆయన తనయుడు బాపినీడు నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్. అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు.
విలన్‌గా వినయ్ రాయ్?
వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'వాన'లో వినయ్ రాజ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తెలుగు కంటే తమిళంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. విశాల్ 'డిటెక్టివ్', శివ కార్తికేయన్ 'డాక్టర్' సినిమాలతో విలన్‌గా టర్న్ అయ్యారు. ఆ రెండు సినిమాల్లో ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాలు చూసి వరుణ్ తేజ్ సినిమాలో విలన్ పాత్రకు వినయ్ రాయ్ ను ప్రవీణ్ సత్తారు సంప్రదించారట.
ప్లాప్ డైరెక్టర్ కి వరుణ్ ఛాన్స్ ఇచ్చాడా?
సుజీత్... 'రన్ రాజా రన్'తో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు. తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న అతడికి, మలి సినిమాలో ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. 'సాహో ' తీశారు. ఆ తర్వాత మరో సినిమా ఓకే కావడానికి మూడేళ్ళు పట్టింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సుజీత్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కల్యాణ్ హీరోగా ఒక రీమేక్ మీద సుజీత్ కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అది ముందు సెట్స్ మీదకు వెళుతుందా? లేదంటే వరుణ్ తేజ్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.
Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?
Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్